మూడురోజులు వర్షాలతో ముంచేస్తానని వరుణదేవుడి హెచ్చరిక!
నైరుతి రుతుపవనాలు రాగల 4,5 రోజులలో కేరళ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఈనెల 21వ తేదీ నాటికి ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడనం బలపడే అవకాశం
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో ఈ నెల 22వ తేదీ నాటికి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడి క్రమేపీ ఉత్తర దిక్కుగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా మరియు ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
పైన పేర్కొన్న ఆవర్తనం నుండి రాయలసీమ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది . నిన్న పశ్చిమ విదర్భ మరియు, మధ్యమహారాష్ట్ర మరియు దాని పరిసరాలలో సగటు సముద్రమట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న మూడు రోజులూ వర్షాలే
ఈరోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల, కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో చాలాచోట్ల, కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఈరోజు ,రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది .ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలితో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications