తెలంగాణాకు భారీ వర్ష హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఇంకా అనేక ప్రాంతాలలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అడపాదడపా కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. గత 20 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు దెబ్బకు తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించి వరద సహాయక చర్యలను చేపట్టింది.

తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు
తెలంగాణలో వరదలకు తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ వంటి జిల్లాలలో ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 20నుంచి 22వరకు రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana rains update heavy rains in these districts from tomorrow IMD alert

ఈ జిల్లాలలో భారీ వర్షాలు .. అలెర్ట్
ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆసిఫాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో ఎలెక్ట్ జారీ చేసింది.

తెలంగాణాకు మళ్ళీ వాన గండం
వర్షాలు పడే జిల్లాలలో బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుండి కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మళ్ళీ ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24 న అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపధ్యంలో తెలంగాణాలో మళ్ళీ వర్షాలు పడే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం వర్షాలకు కారణం ఇదే
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా లేకపోయినప్పటికీ ఏపీ, యానం ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణంలో చేసుకున్న మార్పులు, నైరుతి, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

రెండురోజులుగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భిన్న వాతావరణం
ఏది ఏమైనా మళ్లీ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పు కనిపిస్తుంది .అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగి మళ్ళీ ఎండలు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+