రేవంత్ రెడ్డికి బంగారు పళ్ళెంలో వనరులు అప్పగించామన్న బీఆర్ఎస్; మరి అప్పుల మాటేమిటి?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆపై శాఖల వారీగా జరుగుతున్న సమీక్షలను తెలంగాణ ప్రభుత్వం బకాయిపడిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క విద్యుత్ శాఖలోనే 85 వేల కోట్ల అప్పు ఉందన్న అంశం అందరిని షాక్ కి గురిచేసింది.
ఆఖరికి బతుకమ్మ చీరల దగ్గర నుండి ప్రతి ఒక్కదానిలో తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయి. శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న మంత్రులు గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు సకల వనరులతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించామని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తాజాగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వనరులు ఉన్న బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని వ్యాఖ్యానించారు.
మంత్రులు పదే పదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆర్బిఐ నివేదిక ప్రకారం రాష్ట్రం సొంత పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ 84.2 శాతంతో రెండవ స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిందని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడిస్తే, రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్ది బంగారు పళ్లెంలో వనరులను అప్పగించామని బీఆర్ఎస్ పేర్కొంటుంది. అయితే ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది నిజం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ పైకి ఆల్ ఈజ్ వెల్ చెప్పిందా.. లేక నిజంగానే రాష్ట్రం సుభిక్షంగా ఉందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications