Medaram: దారులన్నీ మేడారం వైపే.. భారీగా చేరుకుంటున్న భక్తులు..!
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారక్క జాతరకు అంత సిద్ధిమైంది. ఇప్పటి నుంచి భక్తులు మేడారం తరలొస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గత జాతర సమయంలో ఆర్టీసీ 3,845 బస్సులు నడిపి 25 లక్షల మంది భక్తులకు సేవలందించింది. అప్పుడు కరోనా వల్ల భక్తులు ఎక్కువగా రాలేదు. కానీ ఈసారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.
ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం వెళ్లారు. ఈ సారి ఆర్టీసీకి భారీగా గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. మేడారం జాతరకు 35 లక్షలకు పైగా భక్తులను తరలించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మహిళలుక ఉచిత ప్రయాణం ఉండడంతో భారీగా భక్తులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు బస్సుల సమస్యలు లేకుండా 6 వేల బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

మేడారంలో ప్రధాన జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ రోజుల్లోనే జాతరకు భక్తులు భారీగా వస్తారు.దీంతో ఆ రోజుల్లో భారీగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలోని 9 రీజియన్ల నుంచి భారీగా బస్సులు నడపనున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్‍తో పాటు మహారాష్ట్ర నుంచి బస్సులు నడవనున్నాయి. 51 పాయింట్ల నుంచి ఫిబ్రవరి 18 నుంచి బస్సులు నడపనున్నారు.
మేడారంలో అతిపెద్ద ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 50 నుంచి 60 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేశఆరు. మేడారం ఆర్టీసీ బేస్ క్యాంపు నుంచి అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. మేడారం జాతర సందర్భంగా 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచే దాదాపు 2 వేల బస్సులు , గ్రేటర్ వరంగల్ సిటీలోని మూడు ప్రధాన పాయింట్ల నుంచి, అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ నుంచి భారీగా బస్సులు నడపనున్నారు.












Click it and Unblock the Notifications