"రైతు భరోసా" పంపిణీలో తెలంగాణ సర్కార్ రికార్డు.. కేవలం 6 రోజుల్లోనే..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకెళ్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను ఇటీవల విడుదల చేసింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 16 న రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే కేవలం ఆరు రోజుల్లోనే రూ. 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
రైతులకు వానాకాలంలో పెట్టుబడి సాయం కింద విడుదల చేసిన రైతు భరోసా నిధుల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గత ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని పేర్కొంది. జూన్ 16 నుంచి కేవలం ఆరు రోజుల్లోనే రూ. 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాక తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగతా నిధులను కూడా వీలైనంత త్వరగా పంపణీ చేపట్టేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

జూన్ 16 న హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే రైతు భరోసా నిధులను బటన్ నొక్కి ప్రారంభించారు. నిధుల పంపిణీ ప్రారంభించిన తొలి ఆరు రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతులకు రూ. 7770.83 కోట్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జూన్ 21 నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమైనట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications