టీ-హబ్‌కు దేశంలోనే అత్యుత్తమ అవార్డు: కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీ-హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమమైనది అయిన నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని టీ-హబ్ సొంతం చేసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు.
టీహబ్‌ను భారత సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు టీహబ్ టీంకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

నేషనల్ టెక్నాలజీ అవార్డ్ 2023లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ అవార్డును టి హబ్ గెలుచుకున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. టీహబ్‌కు జాతీయ పురస్కారం లభించడం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీహబ్ సీఈవో ఎం శ్రీనివాస్‌రావులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పాడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకుంటున్నాయి.
Happy & Proud that @THubHyd has won the National Technology Award -2023 (Technology Business Incubation) 😊
— KTR (@KTRBRS) May 14, 2023
Many congratulations to Team T-Hub 👏
T- Hub has been recognised as the Best Technology Incubator in India by Department Of Science & Technology, Govt of India 🇮🇳 pic.twitter.com/0gbxYeNYpb
తెలంగాణలో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు హస్క్ సంస్థ గ్రీన్‌సిగ్నల్
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి కేటీఆర్ లండన్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ ప్రతినిధులు కలిశారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు వారు సుముఖం వ్యక్తం చేశారు. ఇన్‌క్రెడిబుల్ హస్క్ సీఈఓ కీత్ రిడ్జ్‌వే నేతృత్వంలోని బృందం.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్, ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్, పొట్టు ప్యాలెట్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే ప్రతిపాదిత తయారీ యూనిట్ సంవత్సరానికి 1000 మిలియన్ టన్నుల వరకు బయో ప్యాలెట్‌లను ఉత్పత్తి చేస్తుందని వారు మంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో పొట్టు, పునర్వినియోగ ప్లాస్టిక్ సేకరించేందుకు సహకార నమూనా కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. తెలంగాణ ప్రభుత్వంతో పరస్పర సహకారానికి ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో హస్క్ సంస్థ పెట్టబోయే ప్రతిపాదిత వెంచర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications