విభజన ఎఫెక్ట్: భారీ నష్టం చూస్తున్న కెసిఆర్, రూ.70వేల కోట్లకు బాబు డిమాండ్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏపీఎస్సీహెచ్ఈ ఆస్తుల పంపకం విషయంలో లెక్కల్లో తేడా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆస్తుల పంపకాలు జరగాలి. ఇందులో భాగంగా తమకు రూ.70,000 కోట్ల ఆస్తులు వస్తాయని ఏపీ భావిస్తుండగా, తెలంగాణ లెక్క మాత్రం రూ.25,000 కోట్లు వస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) ఆస్తుల విషయంలో తెలంగాణకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌కు ఊరట లభించింది. ఆస్తులను 52:48 శాతంగా పంచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణకు చుక్కెదురైన నేపథ్యంలో ఏపీ అన్ని ఆస్తుల విషయంలోను అదే విధంగా కోర్టుకు వెళ్లాలని భావించిన విషయం కూడా తెలిసిందే.
అయితే, ఏపీఎస్సీహెచ్ఈ రూ.25వేల కోట్లు ఏపీకి ఇవ్వాల్సిందిగా.. తెలంగాణ లెక్కలు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆస్తులు హైదరాబాదులో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలు షేర్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీ తన కార్యాలయాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలించాలని భావిస్తోంది.

జూన్ నెలలోగా తమ కార్యాలయాలు తరలిస్తామని, ఆలోగా తమకు వచ్చే 52 శాతం వాటా ఇవ్వాలని ఏపీ తెలంగాణను కోరుతోంది. ఏపీఎస్సీహెచ్ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.115 కోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.18 కోట్లుగా ఉంది.
ఇటీవలే ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో 52:48 శాతంగా పంచుకుందామని, ముందుకు రావాలని ఆ లేఖలో కోరింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
ఇందుకు కారణం ఉంది. తెలంగాణ లెక్క ప్రకారం రూ.25వేల కోట్లు వస్తుండగా, ఏపీ లెక్క ప్రకారం రూ.70వేల కోట్లు వస్తున్నాయి. సుప్రీం ఆదేశాల పైన రివ్యూ పిటిషన్ కోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.
షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కింద 120 ఇనిస్టిట్యూషన్‌లు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు ఉమ్మడిగా సర్వీసు అందిస్తున్నాయి. ఇందులో ఎక్కువ కేంద్రాలు హైదరాబాదులోనే ఉన్నాయి.
వీటిలో ఏపీ ప్రభుత్వం 52 శాతం ఆస్తులను కోరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తమకు రూ.70వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. తెలంగాణ మాత్రం రూ.25వేల కోట్లు అని చెబుతోంది.
ఆ సంస్థలకు చెందిన భవనాలు హైదరాబాదులోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి కాస్ట్ ప్రకారం తమకు రూ.70వేల కోట్లు ఇవ్వాలని ఏపీ చెబుతోంది. అయితే తెలంగాణ మాత్రం.. 1956 - 2014 మధ్య గల ఆ భవనాల విలువ ప్రకారం రూ.25వేల కోట్లు చెల్లిస్తామని చెబుతోంది.
అయితే, ఏపీ మాత్రం పాత రేటు కాకుండా.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఇవ్వాలని అంటోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలనడం సరికాదని తెలంగాణ అంటోంది. ఆ భవనాలు కట్టినప్పటి నాటి విలువను కట్టిస్తామని చెబుతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications