తప్పించుకునేందుకే: గవర్నర్‌తో రేవంత్ (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కు ఈ విషయమై వారు వినతి పత్రం అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని సమావేశపరచాలని వారు కోరారు. రైతులు, విద్యార్థులు, మెట్రో రైలు, రామేశ్వర రావుకు భూకేటాయింపులు తదితర సమస్యలు ఉన్నప్పటికీ తెరాస ప్రభుత్వం మాత్రం డిసెంబరు వరకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనలో ఉండటాన్ని వారు తప్పు పట్టారు.

అసెంబ్లీలో వివిధ సమస్యల పైన చర్చ జరిగితే ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే సభను సమావేశపర్చకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. తమ విజ్ఞాపన పత్రం పైన గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ చెప్పారు.

టీ-టీడీపీ

టీ-టీడీపీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ నరసింహన్‌ను బుధవారం కలిశారు. తక్షణమే శాసనసభను సమావేశపర్చాలని కోరారు.

 టీ-టీడీపీ

టీ-టీడీపీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యలను చర్చించి ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో మెట్రో భూముల వ్యవహారాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

టీ-టీడీపీ

టీ-టీడీపీ

మెట్రో భూములను రాష్ట్రంలో ఏర్పాటుకానున్న గేమింగ్ సిటీకి ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతుందంటూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

టీ-టీడీపీ

టీ-టీడీపీ

ఈ మేరకు రేవంత్ రెడ్డి గవర్నర్‌కు ఆ అంశంపై వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు వినతి పత్రం అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+