ఇక పోలీసులు, సైన్యంతో: కార్మికులను మరింత రెచ్చగొట్టిన కెసిఆర్!
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వేతనాలు పెంచుతామని చెబుతున్నప్పటికీ సమ్మె చేయడం ఏమిటనీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తోన్నా విరమించకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గోదావరి పుష్కరాలు ప్రారంభించడానికి బయలుదేరే ముందు సోమవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సమ్మెపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
సమ్మెను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు దారికిరాని కార్మికులపై ఉక్కుపాదం మోపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రంజాన్, బోనాల పండుగలు సమీపిస్తున్న తరుణంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
అవసరమైతే మిలటరీ, పోలీసులు, ఇతర ఉద్యోగులను రంగంలోకి దింపి పారిశుద్ద్య పనులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమ్మెకు దిగిన కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కాకపోయినా వారి డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పినప్పటికీ సమ్మె చేయడం ఏమిటనీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
సోమవారం రాత్రికల్లా సమ్మె విరమించకపోతే వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమ్మె చేస్తోన్న వారు ఔట్ సోర్సింగ్ కార్మికులు అయినప్పటికీ వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా సమ్మె కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
సమ్మె విరమించని పక్షంలో మంగళవారం నుంచి ప్రతామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్మికుల సమ్మెను పరిష్కరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోన్నా సమ్మెను కొనసాగించడం పట్ల ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మున్సిపల్ కార్మికుల సమ్మె
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచుతామని తానే స్వయంగా ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికైనా సమ్మె విరమించి విధుల్లో చేరితే డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమ్మె విరమించకుంటే కార్మికులకే నష్టమని తలసాని హెచ్చరించారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
సమ్మె విరమించకుంటే సైన్యం, పోలీసులను వినియోగిస్తామని, కొత్త వారిని తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ప్రభుత్వం హెచ్చరిక మున్సిపల్ కార్మికులకు మరింత కోపం వచ్చేలా చేసింది. మిలటరీని దింపినా సమ్మె కొనసాగుతుందని వివిధ సంఘాల నేతలు హెచ్చరించారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
సమ్మె విరమింప చేయడానికి జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమ్మె విరమింప చేయడానికి కార్మికులు, సంఘాల నేతలతో సికింద్రాబాద్‌లోని హరిహరా కళాభవన్‌కు వెళ్లిన కమిషనర్ సోమేశ్ కుమార్‌ను ఘెరావ్ చేశారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
కార్మికులకు నచ్చజెప్పాలని చూసిన కమిషనర్‌పై కార్మికులు వాగ్వాదానికి దిగడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవడంతో ఈ సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా, తమకు హామీ ఇచ్చినప్పటికీ.. తమ డిమాండ్లు నెరవేర్చకపోవడం ఏమిటని, నెరవేర్చుతామని మాటమాత్రంగా చెబితే ఎలాగని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
గడిచిన ఎనిమిది రోజులుగా తమతో చర్చలు జరుపుతున్న మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్‌లు చెప్పిందే ఇప్పుడు ముఖ్యమంత్రి చెబుతున్నారని, పైగా సైన్యం, పోలీసులను ప్రయోగిస్తామని చెప్పడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె
ముఖ్యమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే సమ్మె చేస్తున్న ఏడు కార్మిక సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రకటనపైనే ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం హెచ్చరికలు చేయడం దారుణమని, ఇది సరైన పద్ధతి కాదని కార్మిక సంఘాల ఐకాస ఖండించింది.

మున్సిపల్ కార్మికుల సమ్మె
ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదా..? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాయి.

మున్సిపల్ కార్మికుల సమ్మె
కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం నుంచి సమ్మెను ఉద్ధృతం చేయాలని కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాలనుకుంటోందా అని బిఎంఎస్ ప్రశ్నించింది.
మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్ కుమార్, మున్సిపల్ పాలనాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్, నగర పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సివి ఆనంద్ హాజరయ్యారు.
సమ్మె విరమించకుంటే సైన్యం, పోలీసులను వినియోగిస్తామని, కొత్త వారిని తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ప్రభుత్వం హెచ్చరిక మున్సిపల్ కార్మికులకు మరింత కోపం వచ్చేలా చేసింది. మిలటరీని దింపినా సమ్మె కొనసాగుతుందని వివిధ సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ హెచ్చరికలపై కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications