దేశంలోనే నెం. 1 గా తెలంగాణ
మీ ఫోన్ పోయిందా..? ఎవరైనా కొట్టేశారా..? లేక ఎక్కడో పెట్టి మర్చిపోయి వచ్చారా..? నో ప్రాబ్లెమ్.. మళ్లీ మీ ఫోన్ క్షేమంగా మీ దగ్గరికి వస్తుంది. ఇది ఒక్క తెలంగాణలోనే సాధ్యం కావడం విశేషం. మొబైల్ ఫోన్ రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. సెంట్రల్ ఎక్యూప్ మెంట్ ఐడెంటిటి రిజిస్ట్రర్ (సీఈఐఆర్)పోర్టల్ ద్వారా ఇప్పటి వరకూ లక్షకుపైగా ఫోన్ లను రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ సీఈఐఆర్ పోర్టల్ ను 2022 సెప్టెంబర్ 5వ తేదిన ప్రారంభించింది. ఈ పోర్టల్ తెలంగాణలో 2023 ఏప్రిల్ 19న అందుబాటులోకి వచ్చింది.
పోయిన ఫోన్ ను క్షణాల్లో పట్టేడయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. మొబైల్ ఫోన్ రికవరీలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని సీఐడీ ఏడీజీపీ చారు సిన్హా తాజాగా తెలిపారు. ఈ పోర్టల్ ను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభించినప్పటికీ తెలంగాణ మాత్రం టాప్ ప్లేస్ లో ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,00,020 మొబైల్ ఫోన్ లను గుర్తించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. రెండో స్థానంలో 98,189 ఫోన్ రికవరీలతో కర్ణాటక ఉందన్నారు.
కేంద్రం ఈ సీఈఐఆర్ పోర్టల్ ను 2022 సెప్టెంబర్ 5వ తేదిన 16 రాష్ట్రాల్లో ప్రారంభించింది. ఈ పోర్టల్ తెలంగాణలో 2023 ఏప్రిల్ 19న అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 84,003 డివైజ్ లను బ్లాక్ చేయగా.. 45,261 ఫోన్ లను ట్రేస్ చేశారు. 14,965 డివైజ్ లను ట్రేస్ చేసి బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వరంగల్ కమిషనరేట్ పరిధిలో 13,360 డివైజ్ లను బ్లాక్ చేసినట్లు.. 8,382 ఫోన్ లను టేస్ చేసినట్లు..5,564 ఫోన్ లను ట్రేస్ చేసి బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట జోన్ లలోనూ అధికంగానే ఫోన్ లను రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక సీఈఐఆర్ పోర్టల్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ డిజైన్ చేసింది. మొబైల్ ఫోన్ చోరీలను తగ్గించడం కోసం ఈ పోర్టల్ ను ప్రవేశపెట్టింది.












Click it and Unblock the Notifications