తెలంగాణ టూరిజం సూపర్ ఆఫర్: గంటలో తిరుమల శ్రీవారి దర్శనం
తెలంగాణ పర్యాటక శాఖ మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి తిరుమలకు విమానంలో తీసుకెళ్లి, అక్కడ గంట వ్యవధిలో దర్శనం చేయించడంతోపాటు చుట్టు పక్కల దేవాలయాలను చూపించనుంది. ఆ తర్వాత తిరిగి రా
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి తిరుమలకు విమానంలో తీసుకెళ్లి, అక్కడ గంట వ్యవధిలో దర్శనం చేయించడంతోపాటు చుట్టు పక్కల దేవాలయాలను చూపించనుంది. ఆ తర్వాత తిరిగి రాత్రికి హైదరాబాద్ చేర్చేలా తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.
వేసవిలో పర్యాటకాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్న టూరిజం శాఖ రూ. 10 వేలతో ఒక రోజు, రూ. 13 వేలతో రెండు రోజుల ప్యాకేజీలను ప్రకటించింది. ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి అన్నీ ఈ ధరలో ఇమిడి ఉంటాయి. ఒక రోజు యాత్రలో భాగంగా ఉదయం 6:55కు విమానంలో బయలుదేరి 8:10కి రేణిగుంటకు, అక్కడి నుంచి 9:30కు తిరుమల చేరుకునే యాత్రికులకు, ఉదయం 12:30 గంటల్లోపు దర్శనం పూర్తవుతుంది.

ఆ తర్వాత 3 గంటల వరకూ భోజనం, విశ్రాంతి, ఆపై తిరుచానూరు అమ్మవారి దర్శనం, సాయంత్రం 5:35 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి, రాత్రి 7:45కు హైదరాబాద్ చేర్చేలా ప్యాకేజీ ఉంటుంది.
ఇక రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా, తొలుత శ్రీకాళహస్తి, ఆపై భోజన విరామం, సాయంత్రం కాణిపాకం లేదా తిరుచానూరు, రాత్రికి ఫార్చ్యూన్ కేన్సస్‌లో బస, మరుసటి రోజు తిరుమల శ్రీవారి దర్శనం, ఆపై విశ్రాంతి, సాయంత్రం తిరుచానూరు అమ్మవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటాయి. ఇక ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి పర్యటనకు వెళ్లాలనుకునే వారు టీఎస్ టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications