మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు.. 84 స్థానాల్లో కాంగ్రెస్ హవా..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా హవా మాత్రం కాంగ్రెస్ దే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో 84 చోట్ల పీఠాల్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 17 పురపాలికల్ని దక్కించుకుంది. ఇక బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీతో సరిపెట్టుకుంది. అయితే పలు కారణాల వల్ల ఇవాళ 11 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుమలగిరి మినహా అన్ని పురపీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 పురపాలికల్ని హస్తగతం చేసుకుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మున్సిపాలిటీల్ని హస్తం పార్టీ దక్కించుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీల్ని దక్కించుకోగా.. 2చోట్ల కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. అలాగే మెదక్ జిల్లాలో 9 పురపాలికల్ని.. వరంగల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలను హస్తం పార్టీ దక్కించుకుంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 10 పురపీఠాల్ని చేజిక్కుంచుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఏడు పురపాలికల్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు చోట్ల విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ.

మరోవైపు బీఆర్ఎస్ 17 స్థానాల్ని దక్కించుకుంది. ఇదిలాఉంటే పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. వాయిదా పడిన స్థానాల్లో ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, దోర్నకల్, జనగామ, తొర్రూరు పట్టణాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications