'చనిపోవడం కష్టంగా ఉంది, తప్పడం లేదు': 'లవ్ యూ డాడీ, వారిని వదలొద్దు'

Recommended Video

    తెలుగు హస్య నటుడు విజయ్ సాయి సెల్పీ వీడియోలో ఏముందంటే ?

    హైదరాబాద్:తెలుగు సినీ హస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.పై కుటుంబసభ్యులు, భార్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.అయితే విజయ్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే సెల్పీ వీడియో ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు చనిపోవడం కష్టంగా ఉంది, కానీ, తప్పడం లేదంటూ విజయ్ సాయి సెల్పీ వీడియోలో ప్రకటించడం అతడు పడిన మానసిక సంఘర్షణకు అద్దం పడుతోందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

    యూసుఫ్‌గూడలోని తన ఇంట్లోనే విజయ్ సాయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విజయ్ భార్య వనితా రెడ్డితో పాటు శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లు తనను వేధించారని విజయ్ సాయి సెల్పీ వీడియోను రికార్డ్ చేసిన తర్వాత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    అయితే ఈ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. పోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక ఈ వీడియోపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

    సెల్పీ వీడియో ఆధారంగా విచారణ జరపాలి

    సెల్పీ వీడియో ఆధారంగా విచారణ జరపాలి

    విజయ్ సాయి ఆత్మహత్య కేసులో సెల్పీ వీడియోలో విజయ్ చెప్పిన విషయాల ఆధారంగా విచారణ చేయాలని విజయ్ తండ్రి సుబ్బారావు పోలీసులను కోరుతున్నారు. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడ లేవని విజయ్ తండ్రి చెబుతున్నారు. విజయ్ ఇంకా సినిమాల్లో నటిస్తున్నారని ఆయన చెబుతున్నారు.అయితే విజయ్‌ను వేధింపులకు గురి చేయడం వల్లే అతను మరణించాడని ఆయన ఆరోపించారు.

    చనిపోవడం కష్టంగా ఉంది, కానీ, తప్పడం లేదు

    చనిపోవడం కష్టంగా ఉంది, కానీ, తప్పడం లేదు


    చనిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పట్లేదని, తన కుమార్తెను వనితా రెడ్డి దగ్గర నుండి తీసుకురావాలని సెల్పీ వీడియోలో కోరినట్టు చెబుతున్నారు.నాలుగు నిమిషాల పాటు సెల్పీ వీడియోను విజయ్ రికార్డ్ చేశారు. అయితే ఈ వీడియోలో విజయ్‌ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు. దీన్ని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపారు.

    లవ్ యూ డాడీ అంటూ

    లవ్ యూ డాడీ అంటూ


    వనిత లాంటి వారిని వదలొద్దని పేర్కొన్నారు. తన తండ్రిని ఉద్దేశించి.. డాడీ.. ఎవ్వరినీ విడిచిపెట్టొద్దు. నిద్ర పట్టడం లేదు.. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్‌ యూ డాడీ.. కుందన (తన కుమార్తె) అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకుని రండి డాడీ.. ప్లీజ్‌ డాడీ.. అంటూ విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

    ఆత్మహత్య నేను చేసుకోవాలి

    ఆత్మహత్య నేను చేసుకోవాలి

    తనపై విజయ్ సాయి చేసిన ఆరోపణలను ఆయన భార్య వనితా రెడ్డి కొట్టిపారేశారు.అతడికి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉంది. దాన్ని నేను స్వయంగా చూశా. దీంతో విడిపోవాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి దూరంగా ఉంటున్నానని చెప్పారు.గతంలో పిల్లలు వద్దంటూ నన్ను చిత్రహింసలకు గురి చేశాడు. మూడుసార్లు గర్భస్రావం చేయించాడు. ఏ నాడూ నేను బయటకు వచ్చి చెప్పుకోలేదు. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సింది విజయ్‌ కాదు. గతంలో అతడి వేధింపులు తాళలేని నేనే చేసుకోవాల్సిందని వనితారెడ్డి చెప్పారు.విజయ్ పిరికివాడు కాదు. ఆస్తి తగాదాలే విజయ్‌ మరణానికి కారణమై ఉండొచ్చు. విజయ్‌ అంటే నాకు ప్రాణం.. అతడిని చంపుకునేంత పిచ్చిదాన్ని కాదని వనితా రెడ్డి అభిప్రాయపడ్డారు.

    పోలీసులకు విజయ్ ఫిర్యాదు

    పోలీసులకు విజయ్ ఫిర్యాదు


    కూతురంటే విజయ్ సాయికి ప్రేమ ఎక్కువని కుటుంబసభ్యులు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం నాడు కూతురును కొంత సేపు విజయ్ తీసుకెళ్తారని వనితా రెడ్డి చెప్పారు. అయితే తాను ఏనాడూ కూడ తన కూతురును తీసుకెళ్ళకుండా అడ్డు చెప్పలేదని వనితారెడ్డి చెప్పారు. మరో వైపు కూతురు తర్వాత కారును కూడ చాలా జాగ్రత్తగా విజయ్ చూసుకొనేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.కారు తన భార్య పేరు మీద ఉన్న కారు కోనుగోలు కోసం తానే డబ్బులు చెల్లించిన ఆధారాలున్నాయని విజయ్ పోలీసులకు రెండు రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+