బీజేపీలో కిరణ్ మార్క్ రాజకీయం- రాములమ్మకు చెక్: వాట్ నెక్స్ట్..?

హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సమర శంఖాన్ని పూరిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య తెలంగాణ బీజేపీలో సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆమె బీజేపీలో చేరారు. పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో కండువా కప్పుకొన్నారు. ఆ సమయంలో జయసుధ వెంట జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ ఉన్నారు.

actressjayasudhajoinedbjp1

బీజేపీలో చేరాలంటూ ఇదివరకే జీ కిషన్ రెడ్డి.. జయసుధను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు కూడా. కిషన్ రెడ్డి, కొందరు సీనియర్ నాయకులు తనను పార్టీలో చేరాలని ఆహ్వానించారని, కొంత సమయం కావాలని తాను కోరినట్లు గతంలో వెల్లడించారు. కొన్ని షరతులు పెట్టారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అవన్నీ ఓ కొలిక్కి రావడంతో జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో జయసుధ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన విషయం తెలిసిందే. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

రాష్ట్ర విభజన తరువాత పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని పునఃప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జయసుధ మళ్లీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీకి దిగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆ హామీతోనే ఆమె బీజేపీలో చేరారనే అభిప్రాయాలు ఉన్నాయి.

actressjayasudhajoinedbjp

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో జయసుధకు సత్సంబంధాలు ఉండటం, ఆయన ప్రోద్బలంతోనే జయసుధ.. బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. ఇక ఆమె రాక- విజయశాంతికి ఇబ్బందికరంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా జీ కిషన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించే సమయంలో.. విజయశాంతి అర్ధాంతరంగా లేచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఉండటం వల్ల తాను మధ్యలోనే వెళ్లానంటూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+