వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిఎన్నికలపై తెలుగురాష్ట్రాలు తలోదారి: మీకు మీరే.. మాకు మేమే అంటున్న వైఎస్ జగన్, కేసీఆర్!!

|
Google Oneindia TeluguNews

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగుతుండగా, అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి సర్కార్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ను ప్రతిపాదించారు. కేంద్రంలోని బీజేపీ పాలనను వ్యతిరేకించే రాష్ట్రాలన్నీ తమతో పాటు కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీల నుండి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న యశ్వంత్ సిన్హా ను బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలలో ఏకాభిప్రాయం లేదు

రాష్ట్రపతి ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలలో ఏకాభిప్రాయం లేదు

అయితే రాష్ట్రపతి ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి అభిప్రాయం కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు తలోదారి అన్నట్టు రాష్ట్రపతి ఎన్నికలలో వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వం బిజెపి నుండి బరిలోకి దిగుతున్న ద్రౌపది ముర్మును బలపరుస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ మాత్రం విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కే తమ మద్దతును ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల పై కేంద్రం చిన్నచూపు చూస్తుంది అని పదే పదే విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో కెసిఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారును వ్యతిరేకిస్తూ యశ్వంత్ సిన్హా కు మద్దతు ప్రకటిస్తూ ఉండగా, ఏపీ లోని జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా ద్రౌపదీ ముర్ము నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంది.

ద్రౌపది ముర్ముకు జగన్ మద్దతు.. మోడీ, షా లకు మాటిచ్చిన జగన్

ద్రౌపది ముర్ముకు జగన్ మద్దతు.. మోడీ, షా లకు మాటిచ్చిన జగన్


యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేయగా, ముర్ముకు జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతి కావడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కీలకం కావడంతో బిజెపికి 1.4% ఓట్లు తక్కువగా ఉన్నందున ముర్ము ఉన్నత పదవిని కైవసం చేసుకోవడానికి వైసిపి యొక్క 4% ఓట్ షేర్ సరిపోతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఇటీవల జగన్‌ను కలిసిన సమయంలో తమ అభ్యర్థికి వైఎస్సార్‌సీపీ సహకరించాలని కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తమ మద్దతును ప్రకటించారు.

యశ్వంత్ సిన్హాకే తమ మద్దతు.. ప్రకటించిన సీఎం కేసీఆర్

యశ్వంత్ సిన్హాకే తమ మద్దతు.. ప్రకటించిన సీఎం కేసీఆర్


ఇదిలా ఉంటే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతి ప్రయోజనాల దృష్ట్యా యశ్వంత్ సిన్హా కే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అటు బిజెపి ఇటు కాంగ్రెస్ కి సమదూరం పాటించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా యశ్వంత్ సిన్హా వైపు మొగ్గు చూపడాన్ని టిఆర్ఎస్ సమర్థించుకుంటోంది. యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ సభ్యుడు కాదని, మద్దతు ఇవ్వడంలో తప్పేమీ లేదని శరద్ పవార్ సారధ్యంలో కూటమి ఏర్పడిందని, అందుకే కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు శరద్ పవార్ మద్దతు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఒకరు కేంద్రానికి అనుకూలం ... మరొకరు వ్యతిరేకం.. ఆసక్తికర చర్చ

ఒకరు కేంద్రానికి అనుకూలం ... మరొకరు వ్యతిరేకం.. ఆసక్తికర చర్చ


ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని భావిస్తున్న సమయంలో, ఒకరు కేంద్రానికి అనుకూలంగా, మరొకరు కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికలలో తమ మద్దతును ప్రకటించడం తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఎవరి రాజకీయం వాళ్ళది అన్న చర్చ జరుగుతుంది. ఏపీకి కేంద్రం ఎంత అన్యాయం చేసినా జగన్ కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళరు అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణాలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న సమయంలో కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తామని చెప్పటం ఊహించిన పరిణామమే కావటం గమనార్హం.

English summary
The Telugu states have chosen different ways in the presidential election. While the YCP is supporting BJP candidate Draupadi Murmu, the TRS has announced its support for the opposition joint candidate Yashwanth Sinha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X