హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత: ఒకే మార్గంలో మాధవీలత, అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ అంతా సాఫీగా సాగింది.అయితే, హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఒకే మార్గంలో హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
వారిద్దరి వాహనాలు ఒకే మార్గంలో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కోట్ల అలీజ బిబికా బజార్ చౌరస్తా దగ్గర హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు వ్యతిరకంగా కొందరు యువకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేవారు.

ఇంత జరుగుతున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మాధవీలత పోలీసులపై మండిపడ్డారు. దీంతో వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు.. ఆ యువకులను అక్కడ్నుంచి పంపించివేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు నేతలు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
Sherni Madhavi Latha’s convoy attacked by Cowards in Hyderabad.. Owaisi is rattled pic.twitter.com/oPW6HIEmaX
— Viक़as (@VlKAS_PR0NAM0) May 13, 2024
తమ ఓటు తమకు వేసుకోలేకపోయిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ప్రశాంతంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. తమ ఓటును తమకే వేసుకోలేకపోవడం గమనార్హం. ఎందుకంటే, తమ ఓటు వేరే నియోజకవర్గంలో ఉండటమే ఇందుకు కారణం.
సాధారణంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తుంటాం. కానీ, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం అలా జరిగే అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ ఓటును తమకు వేసుకోలేకపోయారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత తమ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనికి కారణం మాధవీ లత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలో మహేంద్రహిల్స్‌లో ఉండటమే. దీంతో ఇది మల్కాజిగిరి నియోజకవర్గంలోకి వస్తుంది. ఫలితంగా ఈమె తన ఓటును తనకు వేసుకోలేకపోయారు.
మరోవైపు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన కూడా తన ఓటును తనకు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చేవెళ్ల ప్రాంతంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎవరూ బరిలో లేరు. దీంతో తన ఓటును వేరొకరికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications