• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రవ్యాప్తంగా గుత్తికోయల గూడేల్లో టెన్షన్; ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మృతితో గిరిజనుల్లో ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు సర్వే కొనసాగుతుంది. పోడు భూముల విషయంలో చాలా కాలంగా ఉన్న వివాదాలకు పరిష్కరం చూపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సర్వేను నిర్వహిస్తోంది. ఇక ఇదే సమయంలో ఊహించని విధంగా చోటు చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఇప్పుడు గిరిజన గూడేలలో ఆందోళనకు కారణంగా మారింది. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను దారుణంగా హతమార్చిన గుత్తికోయలు

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను దారుణంగా హతమార్చిన గుత్తికోయలు


జండాల పాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వేసిన ప్లాంటేషన్ ను తొలగించి గుత్తికోయలు పోడు వ్యవసాయం చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో, వారిని అడ్డుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తికోయలు అతి దారుణంగా పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. వేటకొడవళ్లతో చేసిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన సుమారు గంటకు పైగా అదే అటవీ ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో పాటు ప్లాంటేషన్ ప్రాంతానికి వెళ్లిన అటవీ సిబ్బంది రామారావు తమ అధికారిని చంపవద్దని కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కనికరించని గుత్తికోయలు అటవీ అధికారిని విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చారు.

 సీఎం కేసీఆర్ సీరియస్.. దోషులపై సీరియస్ యాక్షన్

సీఎం కేసీఆర్ సీరియస్.. దోషులపై సీరియస్ యాక్షన్

అక్కడి నుంచి పారిపోయిన రామారావు అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి వెళ్లేసరికి తీవ్ర రక్తస్రావమై రక్తపుమడుగులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు పడి ఉన్నారు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. శ్రీనివాస రావు మృతి చెందారు. ఈ ఘటన పై సీరియస్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్వో కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం, శ్రీనివాస్ రావ్ డ్యూటీలో ఉంటే ఏ విధంగా అయితే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో ఆయన రిటైర్మెంట్ వయసు వరకు వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా జీతభత్యాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

గుత్తికోయల గూడేలలో తీవ్ర ఆందోళన.. అందరిలో టెన్షన్

గుత్తికోయల గూడేలలో తీవ్ర ఆందోళన.. అందరిలో టెన్షన్

ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకోవడంతో గుత్తికోయల గూడేలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్న గుత్తికోయలు దీంతో ఎప్పుడు పోలీసులు తమపై ఏ విధంగా దాడి చేస్తారో అని భయపడుతున్నారు. ఇక పోడు సర్వేలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, తమకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసే వారి గొంతు కూడా ఈ ఘటనతో నొక్కినట్టు అయింది. ఇప్పుడు ఎవరు పోడు సర్వే కి సంబంధించి నోరెత్తినా అధికారులు వారిపై ఉక్కుపాదం మోపే అవకాశం లేకపోలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గ్రామాలపై ఎఫ్ఆర్ఓ హత్య ప్రభావం

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గ్రామాలపై ఎఫ్ఆర్ఓ హత్య ప్రభావం


ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసుల ఒత్తిడితో ఉండే గిరిజన ఏజెన్సీ గ్రామాలను ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక గిరిజన ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం చంద్రుగొండ అటవీ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అన్న భావన వ్యక్తమౌతుంది.

గుత్తికోయ సమాజానికి పెను ప్రమాదం

గుత్తికోయ సమాజానికి పెను ప్రమాదం


గుత్తికోయలు ఇంతటి దారుణానికి పాల్పడడం అందరినీ షాక్ కి గురి చేసే అంశమే అయినప్పటికీ, ముఖ్యంగా గుత్తి కోయ సమాజానికి మాత్రం ఇది పెను ప్రమాదంగా పరిణమించింది. మరి తాజా పరిణామాలతో గుత్తికోయలు ముందు ముందు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
The death of FRO Srinivasa Rao is causing concern among the tribals across the state. As CM KCR is serious about this incident, the tension will continue in Guthikoyas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X