మెదక్ లో ఉద్రిక్తత.!సీఎం కేసీఆర్ టూర్ ను అడ్డుకునే ప్రయత్నం.!కాంగ్రెస్ నేతల అరెస్ట్.!
మెదక్/హైదరాబాద్ : సీఎం పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఆవుల రాజిరెడ్డి హెచ్చరించారు. సీఎం మెదక్ పర్యటన అడ్డుకోవడానికి బైక్ పై ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలుచ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత మంది కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న సీఎం, దల సంక్షేమాన్ని మరిచారని, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆవుల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితులు నెలకొన్నాయని, వరి వేస్తే ఉరే అని చెప్పిన రైతు వ్యతిరేకి సీఎం అని, ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టాక 88వేల మంది రైతులు చనిపోయారని ఆవుల రాజిరెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ నేతల అరెస్ట్ : మెదక్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ఔరంగాబాద్‌లో ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై కోట్ల వ్యయంతో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. నాలుగేళ్ల క్రితం సీఎం చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో ముప్పై ఐదు శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే జిల్లా స్థాయి అధికారుల కోసం ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో, పది ఎకరాల గ్రీనరీని.. కలెక్టరేట్‌కు రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు.

మెదక్ లొ సీఎం పర్యటన : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ నూటపదిహేను నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత, సీఎం చంద్రశేఖర్ రావు తొలి సారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం మెదక్ జిల్లాలో సీఎం చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రశేఖర్ రావు రాక కోసం అధికారులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications