వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. షర్మిల బస్సుకు నిప్పంటించి, రాళ్ళతో దాడి; షర్మిల ఫైర్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో వైయస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల నైట్ హాల్ట్ బసచేసే బస్సును టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తగలబెట్టారు. అడ్డొచ్చిన కార్యకర్తలపై దాడులు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కేసీఆర్ 420; అటవీ అధికారిది ప్రభుత్వ హత్యే.. పోడు చిచ్చు పెట్టారన్న వైఎస్ షర్మిలకేసీఆర్ 420; అటవీ అధికారిది ప్రభుత్వ హత్యే.. పోడు చిచ్చు పెట్టారన్న వైఎస్ షర్మిల

 వైఎస్ షర్మిల బస చేసే బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు

వైఎస్ షర్మిల బస చేసే బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు

నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటుగా, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైయస్ షర్మిల బస చేసే బస్సు ను తగలబెట్టిన టిఆర్ఎస్ కార్యకర్తలు, వైయస్ షర్మిల పాదయాత్ర లో పాల్గొంటున్న వాహనాలపై రాళ్లు రువ్వి రచ్చ చేశారు. వైయస్ షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైయస్ షర్మిల తమ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించడానికి వీల్లేదని, వెనక్కి తిరిగి వెళ్లాలని తేల్చిచెప్పారు.

నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల


ఇక వైయస్ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్న నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఉద్దేశించి వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ట్రాక్టర్ నడిపే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. భార్యాభర్తలిద్దరూ రాజకీయాలలో సంపాదిస్తారట. భూకబ్జాలట, పోస్టింగులకు కమీషన్లట. పంట నష్టపోతే కనీసం సాయం చేయని ఈ ఎమ్మెల్యే ఇక ఉండి ఎందుకు? అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో పెద్ది సుదర్శన్ రెడ్డి టార్గెట్ చేశారు.

నర్సంపేటకు కేసీఆర్ చేసింది ఏంటి? ప్రశ్నించిన షర్మిల


ఇక గురజాల గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్.. ఒక్క పని కూడా చేయలేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. నేటికీ వైయస్ఆర్ వేసిన రోడ్లే ఉన్నయ్. నర్సంపేటకు మిర్చి పరిశోధన కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తీసుకొస్తానని మాటలు చెప్పి, మోసం చేశారని మండిపడ్డారు. రాళ్ల వానతో పంట నష్టపోయి.. ఏడాది కావొస్తున్నా నయాపైసా ఇవ్వలేదని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

 పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీగా పోలీసులు, అరెస్ట్ చేస్తారని వార్తలు

పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీగా పోలీసులు, అరెస్ట్ చేస్తారని వార్తలు


ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో నేడు వైయస్ షర్మిల పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. నర్సంపేట లో జరుగుతున్న పాదయాత్ర లో నలుగురు ఏసిపి లు, 500 మంది పోలీసులు ఒక్కసారిగా వైయస్ షర్మిల ను మోహరించడం తో, ఆమెను అరెస్టు చేశారన్న భావన వ్యక్తమైంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో వైయస్ షర్మిలను అరెస్టు చేస్తారని అందరూ భావించగా, టిఆర్ఎస్ శ్రేణులు వైయస్ షర్మిల వాహనాలను తగలబెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నర్సంపేటలో వాహనం తగబెట్టి చేసిన దాడిపై భగ్గుమన్న షర్మిల

నర్సంపేటలో వాహనం తగబెట్టి చేసిన దాడిపై భగ్గుమన్న షర్మిల


టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడిపై వైయస్ షర్మిల తీవ్రంగా స్పందించారు . పాదయాత్రను అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ విఫలయత్నాలు చేస్తున్నారని, తమ పాద యాత్రకు పర్మిషన్ లేదని పోలీసులు కొత్త కథ చెప్పి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. పోలీసులు పక్కనే ఉండి కూడా తన నైట్ హాల్ట్ బసచేసే బస్సును తగలబడుతుంటే మిన్నకున్నారు అని వైయస్ షర్మిల ఆరోపించారు.

పోలీసులు కెసిఆర్ ఇంటి జీతగాళ్ళా.. పోలీసులపై షర్మిల అసహనం


పోలీసులు కెసిఆర్ ఇంటి జీతగాళ్ళ మాదిరిగా పనిచేస్తున్నారని వైయస్ షర్మిల విమర్శించారు. కావాలని పాదయాత్రను ఆపే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని, అన్ని ఆధారాలు ఉన్నా, తమ పై దాడులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ గుండాలని అరెస్టు చేయడం లేదని వైయస్ షర్మిల విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని, కెసిఆర్, ఆయన పార్టీ గుండాలు చేసే గుండాగిరికి తాను భయపడబోనని వైయస్ షర్మిల తేల్చి చెప్పారు.

English summary
There was tension in YS Sharmila's padayatra. TRS Party workers set fire to the bus where YS Sharmila was staying for the night hault and attacked with stones. Sharmila was fired with this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X