హైదరాబాద్‌ టు శ్రీశైలం హెలికాప్టర్‌ సేవలు - రూట్ ప్లాన్, ప్యాకేజీ ఇలా.!!

తెలంగాణ పర్యాటకంలో కీలక అడుగు పడుతోంది. ప్రభుత్వం హెలీ టూరిజం అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించేలా కసరత్తు తుది దశకు వచ్చింది. మొదట వారాంతాల్లో సేవలు నడిపి, ప్రజల ఆదరణ బట్టి సేవలను విస్తరించనున్నారు. నల్లమల మీదుగా టూరిజం ప్రాంతాలను చూపించనున్నారు. ఈ మేరకు ప్యాకేజీలను ఖరారు చేసారు.

తెలంగాణ ప్రభుత్వం హెలి టూరిజానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌ నల్లమల అడవులు, సోమశిల, అమరగిరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నందున, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతోంది. అయితే హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణిస్తే కేవలం గంటలోపే గమ్యం చేరుకోవచ్చు.

tg-govt-to-launch-heli-tourism-between-hyderabad-and-srisailam-details-her

కాగా, ఈ హెలీ టూరిజంలో భాగంగా ఒక్కో హెలికాప్టర్లో ఆరుగురు నుంచి ఎనిమిది మంది ప్రయాణించే సీటింగ్‌ సామర్థ్యం ఉంటుంది. పర్యాటక శాఖ ఈ టూర్‌ను రెండు నుంచి మూడు రోజుల ప్యాకేజీ రూపంలో రూపొందిస్తోంది. ఇందులో ప్రయాణం, దర్శనం, వసతి వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. త్వరలోనే బుకింగ్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ మరియు మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ తొలి విడత సక్సెజ్ అయితే.. రెండో దశలో వరంగల్‌, ములుగు జిల్లాల్లోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా హెలికాప్టర్‌ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. ఈ హెలి టూరిజం కు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+