TGPSC Group 1: గ్రూప్ 1 తీర్పుపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..!

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది. గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల్ని తిరిగి మూల్యాంకనం చేయించాలని, కుదరకపోతే పరీక్షనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని టీజీపీఎస్సీ ఇవాళ నిర్ణయించింది. ఈ మేరకు గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రూప్ 1 జవాబు పత్రాల్ని రీవ్యాల్యూయేషన్ చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో డివిజన్ బెంచ్ లో ఈ వ్యవహారంపై తేల్చుకునేందుకు సిద్దమయ్యారు.

TGPSC to appeal high court single bench verdict on GROUP 1 exam in division bench

2024 అక్టోబర్ లో నిర్వహించిన తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను తాజాగా హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారించిన హైకోర్టు బెంచ్.. సంజయ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రాజేశ్వర్ రావు ధర్మాసనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ఇవాళ చర్చించిన టీజీపీఎస్సీ డివిజెన్ బెంచ్ లో అప్పీలుకు నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+