TGSRTC: ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ - పోస్టులు, అర్హతలు..!!
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ఖాళీల భర్తీకి నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కొంత కాలంగా తెలంగాణ ఆర్టీసీలో మూడు వేలకు పైగా పలు రకాల పోస్టుల భర్తీ పైన చర్చ జరుగుతోంది. దీని పైన సంస్థ యాజమాన్యం సైతం స్పష్టత ఇచ్చింది. త్వరలోనే పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా, ఇప్పుడు పోస్టుల వివరాలతో పాటుగా అర్హతలు... దరఖాస్తు వివరాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది.
TGSRTC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పూర్తి వివరాలను https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు.దసరా తరువాత నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. తొలి విడత గా వెయ్యి మంది డ్రైవర్లు.. 743 మంది వర్క్ మెన్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఖాళీగా ఉన్న మిగిలిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
కాగా, కొద్ది రోజుల క్రితమే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేసారు. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో, ఉద్యోగార్థులను కొందరు మోసం చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపారు. అడ్డదారుల్లో ఎవ్వరికీ ఉద్యోగాలు రావని, ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని ఉద్యోగార్థులను యాజమాన్యం విజ్ఞప్తి చేసారు.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్( ట్విట్టర్)లో పోస్టు చేశారు. కాగా, ఆర్టీసీలో పలు విభాగాల్లో మొత్తం 3,038 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, అకౌంటెంట్లతో పాటు ఇతర సాంకేతిక , పరిపాలనా సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతితో తొలి విడత పోస్టుల భర్తీకి నిర్ణయించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications