TGSRTC ప్రయాణికులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు పలు సూచనలు ఇచ్చింది. కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు అగ్నిప్రమాదానికి గురైన దుర్ఘటన నేపథ్యంలో గమనికలను జారీ చేసింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో తీసుకుంటోన్న పలు ముందస్తు జాగ్రత్తలు, అగ్నిప్రమాదాలను నివారించడానికి చేపట్టిన ఏర్పాట్ల గురించి ప్రయాణికులకు వివరించింది. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది.

టీజీఎస్ఆర్టీసీలో లహరి, గరుడ ప్లస్, రాజధాని.. వంటి బస్సులు ఏసీ సౌకర్యాన్ని కలిగివున్నాయనే విషయం తెలిసిదే. దీనికి అదనంగా సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగుతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వేర్వేరు నగరాలు, జిల్లా కేంద్రాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. రోజూ లక్షలాది ట్రిప్పులు తిరుగుతూ అదే స్థాయిలో ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరవేస్తోన్నాయి.

TGSRTC Unveils Enhanced Safety Measures in its Buses

కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించడానికి చేపట్టిన చర్యల గురించి వివరించింది టీజీఎస్ఆర్టీసీ. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సుల్లో సేఫ్టీ ప్రీకాషన్స్ ఏర్పాటు చేశామని తెలిపింది. లహరి ఏసీ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల వెనుక భాగంలో అత్యవసర ద్వారం అందుబాటులో ఉందని గుర్తు చేసింది. ప్రమాదాలు సంభవించినప్పుడు బస్సులో ఏ కిటికీ అద్దమైనా పగులగొట్టడానికి సుత్తులు, మంటలు ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగిషెర్లు ఉన్నాయని తెలిపింది.

డ్రైవర్ క్యాబిన్ లో మంటలను ఆర్పడానికి ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, వాటిరి ఆర్పే పరికరాన్ని అమర్చామని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి సైరన్ సైతం అమర్చినట్లు పేర్కొంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగిషర్, బస్సు వెనుక భాగంలో కుడి వైపు అత్యవసర ద్వారం ఉందని తెలిపింది. డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కూడా కుడి వైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం, ఫైర్ ఎక్స్టింగిషెర్లను ఏర్పాటు చేసినట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+