ఆ బాంబు రెండు మూడు రోజుల్లో పేలుతుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రానున్న నాలుగేళ్లపాటు రేవంత్ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను చిట్ చాట్‌లో జర్నలిస్టులు ప్రస్తావించగా.. ప్రతిపక్ష నేతలు మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఏదో ఒకటి మాట్లాడతారని.. అవన్నీ టీ కప్పులో తుపాను లాంటివని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సియోల్ నుంచి వచ్చే లోపే పొలిటికల్ బాంబులు పేలుతాయని చెప్పినప్పటికీ.. ఒకటి, రెండు రోజులు ఆలస్యం కావచ్చన్నారు. నేను పేలుతుందన్న బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పు ఉండదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెప్పగలమని అన్నారు. డిసెంబర్ చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు జరగవచ్చునని తెలిపారు.
ఆర్థికంగా ఎన్నిక ఇబ్బందులు ఉన్నా.. గ్రీన్ ఛానల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుందన్నారు. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధులు జమ చేస్తామన్నారు. ప్రారంభంలో లక్ష రూపాయలు అందిస్తామన్నారు. పిల్లర్లు రూ. 1.25, స్లాబ్ కు రూ. 1.75 లక్షలు, ఇళ్లు పూర్తయ్యాక రూ. లక్ష ఇస్తారని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ గురించి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.












Click it and Unblock the Notifications