అసహజ లైంగిక దాడి, హత్య: విస్తుపోయే విషయాలు, 15 మందికిపైగా బాలురపై...
హైదరాబాద్: పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు అసహజ లైంగిక దాడికి పాల్పడి, అతన్ని హత్య చేసిన ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సిసి కెమెరాల ఆధారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయయం తెలిసిందే.
నిందితుడు ఒక్కప్పటి బాధితుడేనని సమాచారం. అయితే, నిందిత మైనర్ బాలుడు 15 మందికిపైగా బాలురపై అసహజ లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల వాంగ్మూలాలు తీసుకుని మరిన్ని కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో నిందిత బాలుడు ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేశాడు. తన ఇంటి సమీపంలోని ఓ పాన్ షాపులో పనిచేస్తూ వస్తున్నాడు. హతుడైన బాలుడు నిందితుడు చదివిన పాఠశాలలోనే చదువుతున్నాడు.

గతంలో ఇలా...
డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని నిందితుడు పోలీసులకు చెప్పాడు. వారిద్దరి పేర్లు కూడా అతను చెప్పాడు. ఆ సంఘటన తర్వాత ఇతను మైనర్ బాలురను లక్ష్యంగా చేసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతూ వస్తున్నాడు.

ఏడాది కాలంగా...
నిందితుడు ఏడాది కాలంగా అసహజ లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని చేతిలో లైంగిక దాడికి గురైన వారంతా మైనర్ల అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 15 మందికిపైగా బాలురపై అతను ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

అదే భవనంపై....
బాలురకు బిస్కట్లు, చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్నిసార్లు వారికి పది రూపాయలు, 20 రూపాయలు కూడా ఇస్తూ వచ్చాడు. బాలుడి హత్య జరిగిన భవనంపైనే అతను బాలురపై లైంగిక దాడులకు పాల్పడుతూ వస్తున్నాడు. మరో రెండు ప్రాంతాలను కూడా తన కార్యకలాపాలకు వాడుకున్నట్లు డిసిపి సత్యనారాయణ చెప్పారు.

ఆ ఇద్దరు వ్యక్తుల కోసం....
నిందిత బాలుడిపై లైంగిక దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుత నిందితుడి బారిన పడిన ఇతర బాలురను గుర్తించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వారు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తే తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

ముంబైలోనూ పనిచేశాడు....
నిందితుడు ముంబైలోని సోడా మేకింగ్ యూనిట్‌లో కొంత కాలం పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు 9 మంది పిల్లలు కాగా, ఇతను ఏడో సంతానం. నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టి, కరెక్షనల్ హోమ్‌కు తరలించారు.

నిర్మానుష్యమైన ప్రదేశంలో....
నేరానికి నిందిత బాలుడు ఉపయోగించిన పాఠశాల భవనం ప్రాంతంలో సాయంత్రం పూట మానవ సంచారం ఉండదు. పాఠశాల భవనం చుట్టూ సిఆర్‌పి క్యాంపస్, ఆస్పత్రి ఉన్నాయి. భవనం టెర్రాస్ నిందితుడికి సురక్షిత ప్రాంతంగా కనిపించింది. టెర్రాస్ గోడ కూడా మూడు అడుగలపైనే ఉంటుంది. అందువల్ల రెండో అంతస్తులో ఎవరైనా ఉన్నా గుర్తించడం కష్టమే.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications