• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వరం మార్చిన నగర యువత..! నిత్యం అదే టాపిక్..! చర్చంతా వైరస్, వైన్ షాపుల గురించే..!!

|

హైదరాబాద్ : నగర యువత స్వరం మారుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గత 26రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు నగర యువత. అయితే దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంటే నగర యువత కూడా తమ అలవాట్లకు లాక్ వేసుకునే పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఏ చిన్న ఉద్యోగం చేస్తున్న యువకుడు కూడా సాయంత్రం ఓ చల్లని బీర్ సేవించి ఇంటికి వెళ్లిపోవడం సర్వ సాధారణం. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో ఇలాంటి అలవాటును నగర యువత కొద్ది రోజులు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 15తో ఆంక్షలు సడలిపోయి మద్యం షాపులు తెరుచుకుంటాయని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన యువత మరోసారి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది.

వైరస్, వైన్ షాపులు... నగర యువత చర్చంతా ఈ రెండు అంశాల పైనే..

వైరస్, వైన్ షాపులు... నగర యువత చర్చంతా ఈ రెండు అంశాల పైనే..

రోజులు గడుస్తున్నాయి. ఆపీస్ లేదు, మాల్స్ లేవు, సినిమాలు లేవు, స్నేహితుల కలయిక లేదు. జనజీవన స్రవంతి లేదు. చివరకు కిక్కిచ్చే మందు కూడా లేదు. స్వీయ నియంత్రణతో విసిగిపోయిన నగర యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను తూచా తప్పకుండా పాటించారు. మొదట మూడు వారాలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దన్న ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆదేశాలను మనస్పూర్తిగా పాటించారు యువత. మూడు వారాల కాలం ఎంత తొందరగా ముగుస్తుందిలే అనుకుని ఆంక్షలకు కట్టుబడి ఉన్నారు. తమ ఇష్టమైన అలవాటును కూడా వాయిదా వేసుకున్నారు నగర యువకులు.

లాక్ డౌన్ ఆంక్షలు.. స్వీయ నియంత్రణ పాటిస్తున్న యువత..

లాక్ డౌన్ ఆంక్షలు.. స్వీయ నియంత్రణ పాటిస్తున్న యువత..

కాగా లాక్ డౌన్ ఆంక్షలను పొడిగిస్తున్నట్టు, మే 3వ తారీఖు వరకూ ఇదే స్వీయ నియంత్రణ పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ప్రకటించారు. దీంతో నగర యువత ఒక్కపారి ఉలిక్కి పడ్డప్పటికి తప్పని పరిస్ధితులు నెలకొన్నాయి. ఆంక్షల నేపథ్యంలో అలవాట్లను కొంత కాలం దూరం పెట్టినప్పటికి అలవాటైన ప్రాణం కాబట్టి మళ్లీ మనసు మద్యం వైపు లాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. లాక్ డౌన ఆంక్షల సడలింపు రోజు కోసం నగర యువత ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత కాలం కేవలం కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందింది, దానికి బాద్యులు ఎవరు, ఎంత ముందుజాగ్రత్తగా ఉండాలని చర్చించుకున్న యువత ఇప్పుడు మెల్లగా స్వరం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ ఆంక్షలను పొడింగించిన కేంద్రం.. దేవుడా అనుకున్న యువత..

లాక్ డౌన్ ఆంక్షలను పొడింగించిన కేంద్రం.. దేవుడా అనుకున్న యువత..

ప్రస్తుతం నగరంలో ఏ ఇద్దరు స్నేహితులు తారస పడ్డా ఒకటే చర్చ. అరే మామా మీ ఏరియాలో వైన్ షాపుల వెనక డోర్ నుండి మందు అమ్ముతున్నారట కదా.. ఏమన్నా వీలైతే చూడు మామా.. మే మూడు తర్వాత మస్తుగా పార్టీ చేసుకుందాం గాని ముందైతే ఏమన్నా దొరుకుతుందేమో చూడు మామా.. ఇదీ నగర యువతలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ. గత 26 రోజులుగా కఠిన ఆంక్షల నేపథ్యలో మద్యం అలవాటును కష్టంగా వాయిదా వేసుకున్న యువత మరింత సహనంగా ఉండేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. పబ్బుల్లో, క్లబ్బులో జాలీగీ గడిపిన యువతను ఒక్కసారిగా పంజరంలో బంధించినట్టు అయిపోయిందనే చర్చ జరుగుతోంది.

ఆంక్షలు ఇక చాలు .. వైన్ షాపులకు వెసులు బాటు ఇవ్వాలంటున్న యువత..

ఆంక్షలు ఇక చాలు .. వైన్ షాపులకు వెసులు బాటు ఇవ్వాలంటున్న యువత..

అంతేకాకుండా ప్రస్తుతం నగర యువత తమ ఆలోచనను మార్చుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ గురించి మాట్లుడుకుంటూనే వైన్ షాపుల గురించి చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఓ గడువు వరకు తూచా తప్పకుండా పాటించిన యువత మద్యం విషయంలో మాత్రం వెసులు బాటును కోరుకుంటున్నారు. మద్యం మీద ఉన్న ఆంక్షలను తొలంగించి అందుబాటులో ఉంచితే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నుండి మద్యానికి మినహామింపు ఇవ్వాలనే డిమాండ్ నగర యువత నుండి వినిపిస్తోంది. కరోనా వైరస్ గురించే కాకుండా వైన్ షాపుల ఎప్పుడు తెరుచుకుంటాయనే చర్చ కూడా నగర యువతలో జోరందుకుంటున్నట్టు తెలుస్తోంది.

  TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life

  English summary
  There is a debate about whether it would be better if alcohol restrictions were removed and made available. The demand for alcohol exemption from lockdown restrictions is being heard from city youth.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X