వెడ్డింగ్‌షూటే కదా..శోభనం అయితే కాదు కదా..!
ఈ రోజుల్లో పెళ్లి అనగానే కేవలం బంధుమిత్రుల సందడి కాదు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వెడ్డింగ్ షూట్‌లు కూడా. కొందరు జంటలు తమ పెళ్లి జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుండేలా, నలుగురికీ భిన్నంగా ఉండాలని కొన్ని సాహసోపేతమైన, మరికొన్నిసార్లు హాస్యాస్పదమైన 'పిచ్చి పిచ్చి' చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ ఆరాటం కొన్నిసార్లు హద్దులు దాటి, వివాదాస్పదంగా మారుతోంది. పవిత్రంగా భావించే వివాహ బంధానికి నాంది పలికే ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, కొన్నిసార్లు అసహ్యించుకునే స్థాయికి చేరిపోతున్నాయి.
కొందరు జంటలు అందరికంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటూ శ్మశానాలు వంటి అసాధారణ ప్రదేశాల్లో షూట్‌లు చేయించుకుంటున్నారు. ఇది సంప్రదాయవాదుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అంతేకాదు, సముద్రాలు, నదులు, కొండలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో సాహసోపేతంగా షూట్‌లు చేయించుకుంటూ, కొందరు జంటలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బైక్‌లపై స్టంట్‌లు చేస్తూ షూట్‌లు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు అనవసరమైన రిస్క్‌కు దారితీస్తున్నాయి.

జంటల మధ్య కెమిస్ట్రీని చూపించడం ప్రీ-వెడ్డింగ్ షూట్‌ల ముఖ్య ఉద్దేశ్యం. కానీ కొన్నిసార్లు ఈ కెమిస్ట్రీ హద్దులు దాటి, ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా మారుతోంది. సెమీ-న్యూడ్‌గా ఉండే ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు సైతం కొందరు చేయించుకుంటున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయబడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
கல்யாணத்தைன்னைக்கு வரும் முதல் நைட் தான் முதல் ராத்திரினு நினைச்சா நீயும் என் நண்பனே🤫🤨#Pre #Wedding shoot #Atrocities
— மஞ்சள் 💛 நிலா (@Manjall) June 18, 2025
pic.twitter.com/WX7EdwQwRI
తాజాగా ఓ జంట చేసిన క్రేజీ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వీడియోలో, ఓ జంట స్విమ్మింగ్ పూల్‌లో హద్దులు మీరిన రొమాన్స్ చేస్తూ కనిపించారు. స్విమ్ సూట్‌లో ఉన్న అబ్బాయి, అమ్మాయికి ముద్దు పెడుతూ కెమిస్ట్రీని పండించే ప్రయత్నం చేశారు.
ఈ తతంగం మొత్తాన్ని కెమెరామెన్ నీటి లోపల నుంచి, బయట నుంచి అత్యంత క్రియేటివ్‌గా చిత్రీకరించాడు. అయితే, వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "పెళ్లి కాకముందే ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో ఫస్ట్ నైట్ కూడా చేసేస్తారేమో?" అంటూ ఓ నెటిజన్ వీడియోను పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications