Telangana: హాస్టల్ విద్యార్థులకు శుభవార్త.. పెరగనున్న మెస్ ఛార్జీలు..!
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లల్లో మెస్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులు సీఎం కేసీఆర్ కు పంపించారు. 3 నుంచి -7వ తరగతి హాస్టల్ విద్యార్థులకు రూ.1200, 8- నుంచి10వ తరగతి చదివే వారికి రూ.1400, ఇంటర్ విద్యార్థులకు 1875 రూపాయల మెస్ ఛార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదిన పంపారు.
ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఓకే చెబితే దాదాపు 25 శాతానికిపైగా డైట్ చార్జీల పెరిగినట్లు అవుతుంది. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సంక్షేమ హాస్టళ్ల మెస్ ఛార్జీలపై ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకన్నా అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే ఉండాలన్నారు.

సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఛార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు పోషకాహారం అందడం లేదని చెప్పాయి. ఇప్పటికైనా స్పందించి మెస్ ఛార్జీలు పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. అలాగే విద్యారంగాని ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications