Weather Update: తెలంగాణకు వర్షసూచన..!

తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలులు కిందిస్థాయిలో వీస్తున్నాయని.. ఈగాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు వస్తున్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి కొనసాగుతోందని, ద్రోణికి తోడు రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఈశాన్య అరేబియాలో తుఫాను ఉందని వివరించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఉదయం ఉక్కపోతగా ఉండి సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమం నుంచి వచ్చే గాలుల వేగం పెరిగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

The Meteorological Department has said that rain is likely to occur in many districts of Telangana today

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గోల్కొండలో అత్యధికంగా 5.80 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసింది. సిటీ రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్, హైదర్ నగర్, డబీర్ పురా, , మధురానగర్, కొత్తపేట్, ఎస్ఆర్ నగర్ చెట్లు నెలకొరిగాయి.

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీకి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెట్లు విరిగిపడ్డాయని, వర్షపు నీరు ఆగిందని ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ సిటీలో భారీ నేపథ్యంలో అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అలెర్ట్ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+