ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డి
హజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాచకొండ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ . నలుగురు బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగష్టు 15న జన్మించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.1990 ఆగష్టు15న జన్మించాడని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన దుర్మార్గుడు అని తెలిపారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున పుట్టి బాలికల జీవితాలు చిదిమేశాడని ఫైర్
ఆగష్టు 15న సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మించాడన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు కారణం ఆవుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలోకి వెళ్ళటంతో నెటిజన్లు మానవ మృగం శ్రీనివాసరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున జన్మించాడు ఏం లాభం అభం శుభం తెలీని బాలికలపై అత్యాచారం చేసి వారి ప్రాణాలను హరించేస్తున్న మానవ మృగం అంటూ మండిపడుతున్నారు.

శ్రీనివాస రెడ్డి ని ఉరితీయాలని డిమాండ్
ఇతరుల ప్రాణాలను హరిస్తున్న ఈ మానవమృగాన్ని ఉరితియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని అతనికి మరణశిక్ష పడేలా సెక్షన్లు పెట్టాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాకాకపోతే ప్రజాకోర్టులో ఉరితియ్యాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

శ్రీనివాసరెడ్డిది పక్కా క్రిమినల్ మైండ్ ... భయం లేదు అన్న సీపీ మహేష్ భగవత్
హజీపూర్ హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిది క్రిమినల్ మనస్తత్వం అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డికి భయం అంటూ ఏమీ లేదని పక్కా సైకో అంటూ స్పష్టం చేశారు. ఆగష్టు 15 న దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున జన్మించి ఆడపిల్లల జీవితాలను మొగ్గలోనే తుంచేశాడని సీపీ సైకో శ్రీనివాసరెడ్డి గురించి చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications