ఎనుమాముల మార్కెట్ లో 50వేలకు చేరువలో ..రికార్డ్ బ్రేక్ చేస్తున్న మిర్చి ధర!!
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత నెల రోజులుగా మిర్చి ధరలు ఆకాశాన్నంటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం క్వింటాల్ ఎర్ర మిర్చి ధర క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ.48,000 ధర పలకగా, సోమవారం అదే రకం క్వింటాల్ రూ.45,000కు విక్రయించబడింది.

50వేల రూపాయలకు చేరువగా క్వింటాల్ మిర్చి ధర
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర 50 వేల రూపాయలకు చేరువలో ఉండటం రైతులకు సంతోషాన్నిస్తుంది . రోజురోజుకు దేశీయ మిర్చి రికార్డ్ బ్రేక్ చేస్తుండడంతో మిర్చి సాగు చేస్తున్న రైతులు లాభాలను చవిచూస్తున్నారు. ఈ సారి మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 27,000తో సీజన్ ప్రారంభం కాగా, ఊరగాయలు మరియు కారం పొడి చేయడానికి ఉపయోగించే 'సింగిల్ పట్టీ' రకం మరియు దేశీ రకం మిరపకాయలకు మంచి డిమాండ్ ఉంది.

వరంగల్ మార్కెట్ లో మిర్చి రైతుల పంట పండింది
మంగళవారం మార్కెట్‌కు 44 బస్తాలు తీసుకురాగా రికార్డు ధర పలికింది. భూపాలపల్లి మండలం పుల్లూరి రామయ్య పల్లికి చెందిన రైతు పుల్లూరి మాధవరావు మొత్తం రూ.19.80 లక్షలు పొందాడు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం కర్కపల్లికి చెందిన రైతుకు సోమవారం 24 బస్తాల ఎర్ర మిర్చి (ఒక్క పత్తి) క్వింటాల్‌కు రూ.45 వేలు వచ్చింది. మార్చి 10న ఒక్క పత్తి మిర్చి రకానికి క్వింటాల్‌కు రూ.42 వేలు రైతుకు లభించింది.

మిర్చి ధరల రికార్డ్ బ్రేక్ .. రీజన్ ఇదే
గతేడాది అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 8,000 నుంచి రూ. 9,000 వరకు మాత్రమే పలికింది . చీడపీడల కారణంగా దిగుబడి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మిర్చి ధరల ఈ రికార్డుకు కారణంగా చెబుతున్నారు.ఇదిలావుండగా, కొంత సమయం వరకు వేచి ఉండే స్థోమత ఉన్న పలువురు రైతులు అధిక ధరల కోసం తమ ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీ యూనిట్లలో నిల్వ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వరంగల్ మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు మిర్చి ఎగుమతి
ఈ మార్కెట్ యార్డులో విక్రయించే ఎర్ర మిర్చి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనుమాముల మార్కెట్ సెస్ రూపంలో మొత్తం రూ.33.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. లక్ష్యం రూ.28.30 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.33.63 కోట్లు లక్ష్యాన్ని మించి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచింది అని కార్యదర్శి బి వెంకటేష్ రాహుల్ అన్నారు. మార్కెట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఆర్జించిన సెస్ అత్యధికమని చెప్పారు.












Click it and Unblock the Notifications