• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం ...ఉద్యోగం కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి.. కట్టుకథ ఏం చెప్పాడంటే

|

ఉద్యోగం కోసం కన్న తండ్రిని హతమార్చాడు ఒక కిరాతకుడు. కేవలం తండ్రి ఉద్యోగం త్వరగా చేజిక్కించుకోవాలన్న దురాశ ఆ కొడుకును పేగుబంధం మర్చిపోయేలా చేసింది. చిన్ననాటి నుండి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రిని అత్యంత కర్కశంగా హతమార్చేలా చేసింది. రక్త సంబంధానికి అర్థం లేకుండా చేసింది. తండ్రిని చంపటమే కాకుండా పోలీసులకు అనుమానం రాకుండా పెద్ద కథ చెప్పాడు ఆ కర్కశ తనయుడు.

ప్రియురాలు మోసం చేసిందని .. ప్రాణాలు తీసుకున్న యువకుడు

ఉద్యోగం కోసం దారుణం .. తండ్రిని హతమార్చిన తనయుడు

ఉద్యోగం కోసం దారుణం .. తండ్రిని హతమార్చిన తనయుడు

తండ్రి ఉద్యోగాన్ని త్వరగా చేజిక్కించుకోవాలన్న దురాశతో నాన్ననే హత్య చేశాడు ఓ కిరాతక కొడుకు. గత ఆదివారం పాల్వంచలో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేదించారు. ఈ కేసు వివరాలలోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గుగ్గిళ్ల వీరభద్రం కేటీపీఎస్‌ ప్లాంటులోని బొగ్గు కర్మాగారంలో వ్యాగన్‌ టిప్లర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక ఇంటర్మీడియట్‌ కాలనీలో నివాసం ఉంటున్న గుగ్గిళ్ల వీరభద్రం(52) ఆదివారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. కేటీపీఎస్‌లో పీఏగా విధులు నిర్వర్తించే ఆయన శనివారం రాత్రి విధులకు వెళ్లాడు. మద్యంతాగి ఉన్నాడన్న కారణంతో కేటీపీఎస్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమించాడు.

కేసు నుండి తప్పించుకునేందుకు కట్టు కథ అల్లిన కొడుకు

కేసు నుండి తప్పించుకునేందుకు కట్టు కథ అల్లిన కొడుకు

ఇంతలోనే తెల్లవారు జామున హత్యకు గురికావడం విస్మయం కలిగించింది. తనయుడే హతమార్చి తనకు ఏమి సంబంధం లేనట్టు పెద్ద స్టోరీ చెప్పాడు . తెల్లవారుజామన అరుపులు కేకలు వినిపించడంతో లేచి చూసేసరికి వీరభద్రం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడని, కొంతకాలంగా తన ప్రేమ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయనీ, కొద్ది రోజుల క్రితం అమ్మాయి తరఫు వారు వచ్చి హెచ్చరించి వెళ్లారని ఈ నేపథ్యంలో తను అనుకొని తన తండ్రిని హత్య చేసి ఉంటారని సంతోష్‌ పెద్ద కట్టుకథ చెప్పాడు. చివరకు జాగిలాలు అక్కడక్కడే తిరగడం, ఇతర కొన్ని ఆధారాల నేపథ్యంలో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని చేదించారు .

మర్డర్ మిస్టరీని చేదించిన పోలీసులు ... కొడుకే నేరస్థుడు

మర్డర్ మిస్టరీని చేదించిన పోలీసులు ... కొడుకే నేరస్థుడు

ఉద్యోగం కోసం కన్నతండ్రినే హతమార్చాడని పోలీసులు తండ్రిని చంపిన తనయుడి ఉదంతం వెల్లడించారు. వీరభద్రం ఉద్యోగవిరమణ అనంతరం చిన్న కొడుకు సంతోష్‌కు ఆ ఉద్యోగం ఇప్పించేలా కుటుంబసభ్యుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని , అప్పటినుంచి ఉద్యోగంపై సంతోష్‌ తాపత్రయం పెంచుకున్నాడు. తండ్రి ఉద్యోగాన్ని త్వరగా చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తన తండ్రిని ఇంటి వెనుక భాగానికి తీసుకువెళ్లి.. కత్తిపీటతో మెడపై నరికాడు. పోలీసులు అతడిని విచారించగా, హత్య చేశానని అంగీకరించాడని తెలిపారు.

English summary
A son killed his father with a greedy desire to get his job done quickly. The mysterious murder happended in Palvancha on last Sunday. Veerabhadram (52) from Bhadradri district of Palvancha is working as a wagon tipper operator in the coal factory at the KTPS plant. His son Santhosh killed his father stabbed with a cutlery and thought that the job would come soon after his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more