వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్వా ఫాతిమా: గర్భంతోనే 15 గంటల పాటు విమానం నడిపి, అరుదైన రికార్డుల హైద్రాబాదీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Syeda Salva Fatima : గర్భంతోనే 15 గంటల పాటు విమానం నడిపి, అరుదైన రికార్డుల హైద్రాబాదీ

హైదరాబాద్: కృషి, పట్టుదలతో పేదింటి ముస్లి యువతి తన లక్ష్యాన్ని సాధించింది. అనేక సమస్యలు అడ్డొచ్చినా కానీ, ఆ యువతి తన లక్ష్యాన్ని చేరుకొంది. కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొందిన నాలుగో ముస్లిం యువతిగా చరిత్ర సృష్టించింది. హైద్రాబాద్‌కు చెందిన సల్వా ఫాతిమా కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

ఎన్ని అడ్డంకులు వచ్చినా, తమ లక్ష్య సాధనకు కృషి చేసి విజయం సాధించిన వారు అరుదుగా కన్పిస్తున్నారు.తమ లక్ష్యాల సాధనలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తేనే తుది లక్ష్యానికి చేరుకొంటారు.

అయితే తుది లక్ష్యం చేరుకొనే వరకు ఎదురయ్యే అడ్డంకులను దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ తరహ అడ్డంకులను సల్వా ఫాతిమా అధిగమించింది. తాను కోరుకొన్న లక్ష్యాన్ని చేరుకొంది. దేశంలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ దక్కించుకొంది.

కమర్షియల్ పైలెట్‌ లైసెన్ప్ సాధించిన సల్వా ఫాతిమా

కమర్షియల్ పైలెట్‌ లైసెన్ప్ సాధించిన సల్వా ఫాతిమా

కడు పేద కుటుంబంలో జన్మించిన సల్వా ఫాతిమా పైలెట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకొంది.టీవీల్లో పైలెట్స్‌,ను చూసినప్పుడు పైలెట్ కావాలనే కోరిక పుట్టిందని సల్వా ఫాతిమా చెప్పారు.అంతేకాదు పైలెట్ కావాలని మనసులో బలంగా కోరుకొంది. చివరికి తన లక్ష్యాన్ని చేరుకొంది. అయితే కడు పేద కుటుంబం సల్వా ఫాతిమాది. తండ్రి అష్వాక్ అహ్మద్ బేకరీలో పనిచేస్తారు. చార్మినార్ సమీపంలో అద్దింట్లో నివాసం ఉంటారు. ముగ్గురు పిల్లల తండ్రి అహ్మద్.ఈ కష్టాలను చూసినా సల్వా ఫాతిమా తన లక్ష్యాన్ని చేరుకొంది.

పైలెట్ కథనాలను చదివి ప్రేరణ

పైలెట్ కథనాలను చదివి ప్రేరణ

సల్వా ఫాతిమా తండ్రి అహ్మద్ బేకరీలో పనిచేసేవారు. ఆయనకు అతి తక్కువ వేతనం వచ్చేది. పిల్లల కడుపు నింపడమే కష్టంగా ఉండేది. అయితే పైలట్‌కు సంబంధించి పేపర్‌లో ఎలాంటి కథనాలు వచ్చినా చదివేదాన్నని సల్వా ఫాతిమా చెప్పారు.. పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్ పూర్తి చేసినట్టు సల్వా ఫాతిమా గుర్తు చేశారు..

 2007లో సికింద్రాబాద్ ఏవీయేషన్ అకాడమీలో చేరిక

2007లో సికింద్రాబాద్ ఏవీయేషన్ అకాడమీలో చేరిక

2007లో సల్వా ఫాతిమా పైలట్‌ శిక్షణలో చేరారు. 2013లో పైలెట్ శిక్షణను పూర్తి చేసుకొన్నారు.. 2016లో మల్టీ ఇంజిన్‌ టైప్‌ రేటింగ్‌ పూర్తి చేసింది. 2016 చివర్లో ఎయిర్‌బస్‌ 320 టైప్‌ రేటింగ్‌ పూర్తి చేసి కమర్షియల్‌ పైలట్‌గా లైసెన్స్‌ సాధించింది. దేశంలోనే ఈ లైసెన్స్‌ సాధించిన నాలుగో ముస్లిం మహిళగా ఘనత సాధించింది.

 అద్భుత ప్రతిభను కనబర్చిన సల్వా ఫాతిమా

అద్భుత ప్రతిభను కనబర్చిన సల్వా ఫాతిమా

అంతర్జాతీయ ఏవియేషన్‌ షోలో అద్భుతమైన విన్యాసాలు చేసి సల్వా ఫాతిమా అందరినీ అబ్బురపరిచింది. ఆమె ప్రతిభను చూసి అంతర్జాతీయ పైలట్లు మెచ్చుకున్నారు. నా జీవితాశయం సాధించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఒక పేదింటి పైలట్‌గా ఎదగడం మామూలు విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అసమానతలు ఎదుర్కొన్నానని సల్వా ఫాతిమా చెప్పారు. హిజాబ్‌ (తలపై ధరించే వస్త్రం) కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విదేశాల్లో శిక్షణ తీసుకున్న సమయంలోనూ నేను ధరించాను. ఎవరూ అడ్డంకి చెప్పలేదు. హిజాబ్‌ వృత్తికి అడ్డు కాదన్నారామె.

గర్భీణీగా ఉంటూ 15 గంటలు విమానం నడిపిన సల్వా

గర్భీణీగా ఉంటూ 15 గంటలు విమానం నడిపిన సల్వా

సల్వా 2013లో సెస్‌నా 152 విమానాన్ని 200 గంటల పాటు నడిపింది. అదే విధంగా సోలో ఫ్లైట్‌ను 123 గంటల పాటు నడిపించి పైలట్‌ శిక్షణ పూర్తి చేసుకుంది. 2016లో బహుళ ఇంజిన్‌ ట్రైనింగ్‌కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు అందజేసింది. ఈ సమయంలో ఆమె గర్భిణిగా ఉన్నారు. అయినా వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌లో 15 గంటల పాటు బహుళ ఇంజిన్‌ విమానాన్ని నడిపింది. దీంతో ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2017లో నవంబర్‌లో బహ్రెయిన్‌లో ఎయిర్‌బస్‌ 320 విమానాన్ని 60 గంటల పాటు నడిపి, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ సాధించింది.

English summary
For a city that is 400 years old, it’s no surprise that Hyderabad has a long list of people who have led exemplary lives. From 10 Hyderabadis who made it big! to Inspiring women WhatsUpHyderabad has tried its best to highlight the stories of some of these people. This time it’s Syeda Salva Fatima.Meet Syeda Salva Fatima, a 27 year old girl who has learnt to fly. Clad in a burqa Fatima looks like a normal muslim girl until she reveals her super-power which is being able to fly. Well, not literally though, by flying…I meant flying aeroplanes. Yes, Fatima is a pilot and perhaps the first muslim lady pilot in india with a commercial flying license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X