తెలంగాణాకు కేంద్రం ఇచ్చిన నిధుల సమగ్ర నివేదిక ఇచ్చిన కేంద్రమంత్రి
చాలా కాలంగా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమి నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తుందని అధికార బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమగ్ర నివేదికను ప్రజలకు సమర్పించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ఈ నివేదికను ప్రజలకు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రభుత్వ సంస్ధలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల 80 వేల 904 కోట్ల రూపాయల సాయం అందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నాబార్డు ద్వారా వివిద సంస్ధలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించినట్లు, వివిధ ప్రభుత్వ సంస్థలకు వడ్డీ లేని మరో లక్షన్నర కోట్ల రూపాయలు అందించినట్లు కూడా మంత్రి చెప్పారు.

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్ధలద్వారా మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయిల నిధులను రాష్ట్రంలో ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. గత యూపీఏ ప్రభుత్వ హాయాం తో పోలిస్తే పన్నులలో రాష్ట్రాల వాటా గణనీయంగా పెరిగిందన్నారు . తెలంగాణ వాటా కింద ఇంతవరకు లక్షా 60 వేల కోట్ల రూపాయలను అందించినట్లు, వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకోసం రాష్టంలో 5 లక్షల 27 వేల కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
పార్లమెంటు సభ్యుల అభివృద్ది నిధి కింద 983 కోట్ల రూపాయలను అందించినట్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం కింద 2250 కోట్ల రూపాయలను అందించినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి జాతీయ రహదారుల అభివృద్ది కోసం లక్షా ఎనిమిది కోట్ల రూపాయిలను ఖర్చు చేసిందని, 9 ఏళ్ళలో 2500 కిలో మీటర్ల పైగా రహదారులను నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మినహా అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించినట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఇదే సమయంలో మూడు కొత్త రైలుమార్గాలను నిర్మించి, 1645 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఉడాన్ పధకంకింద రైలు మార్గాలను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ను 353 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో దాదాపు 11 వేల కోట్ల రూపాయలతో రామగుండం 1600 మెగావాట్ల ప్రాజెక్టును పునర్నించినట్లు తెలిపారు.

దేశంలో అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును 443కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌభాగ్య పధకంకింద 5 లక్షలపైగా ఇళ్ళకు ఉచిత విద్యుత్ సదుపాయం అందించినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ కార్యక్రమం, అమృత్ కార్యక్రమం కింద పలు మునిసిపాలిటీల అభివృద్దికి వందలాది కోట్ల రూపాయల సాయం అందించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో తగిన పురోగతి లేదని, రాష్ట్రంలో 4400కోట్ల రూపాయలను అందించినట్లు చెప్పారు.
గ్రామీణాభివృద్ది కింద 12 వేల 5 వందల కోట్ల రూపాయలను కేటాయించి, పురపాలికలకు దాదాపు 7 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు సమ్మాన్ నిధి కింద 9 వేల కోట్ల రూపాయలకు పైగా అందించినట్లు, లక్షా 24 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసి 20 లక్షలమంది రైతులనుంచి ధాన్యంకొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇతర వ్యవసాయ పధకాల కింద 1220 కోట్ల రూపాయలను అందించినట్లు పేర్కొన్నారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని త్వరలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications