అన్నను చంపిన తమ్ముడు ... అన్న ఎదుగుదల తట్టుకోలేకనే దారుణం

మానవత్వం మంటగలిసి పోతుంది.రాక్షసత్వం రాజ్యమేలుతోంది. రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. ఒకప్పుడు అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉండేవారు. ఒకటిగా, సమిష్టిగా మెలిగేవారు. కానీ ఇప్పుడు మనుషుల్లో పెరిగిన స్వార్థం ప్రేమానుబంధాలకు అర్థాన్ని చెరిపేసింది. ఒక అన్న ఎదుగుదలను చూసి ఓర్వలేని తమ్ముడు ఏకంగా అన్ననే హతమార్చాడు అంటే మనుషుల్లో రాక్షసప్రవృత్తి ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ సూరారంలో అన్నను హతమార్చిన తమ్ముడు

హైదరాబాద్ సూరారంలో అన్నను హతమార్చిన తమ్ముడు

అన్న ఆర్థికంగా ఎదుగుతుంటే చూడలేకపోయిన ఓ తమ్ముడు ఎలాగైనా అన్నను హతమార్చాలని అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసిన ఆ నయవంచకుడు అన్న ఇంట్లో ఎవరూ లేని టైం చూసి గొంతుకు ఉరివేసి ప్రాణం తీశాడు. అంతేకాదు ఆపై దానిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు.అనుమానం రావడంతో పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసుల ఎంక్వైరీ లో అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ సూరారంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే

అన్న ఎదుగుదల చూసి తట్టుకోలేక దారుణం

అన్న ఎదుగుదల చూసి తట్టుకోలేక దారుణం

హైదరాబాద్ సూరారంలో స్థానికంగా నివసించే షాజదాబేగానికి మొదటి భర్త ద్వారా సాబేర్ జన్మించగా, రెండో భర్త కుమారుడు ఆజమ్ పుట్టాడు .ఇక వీరిరువురూ ఒకే తల్లికి పుట్టిన అన్నా తమ్ముళ్లు. సాబేర్ సొంతంగా ట్యాంకర్ నడుపుకుంటూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. సొంత ఇల్లు కట్టుకుని భార్య, కుమారుడితో విడిగా ఉంటున్నాడు. తన జీవితం తాను బతుకుతున్నాడు.ఇక సోదరుడు ఆజమ్ మాత్రం ఒక మెడికల్ షాప్ లో పని చేస్తున్నాడు. అన్న బాగా సంపాదించి స్థిరపడటం,తాను ఇంకా జీవితంలో ఎదగకపోవడంతో అన్న ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోయాడు ఆజమ్.

ఎవరూ లేని సమయంలో గొంతుకు బెడ్ షీట్ తో ఉరి బిగించి చంపిన తమ్ముడు

ఎవరూ లేని సమయంలో గొంతుకు బెడ్ షీట్ తో ఉరి బిగించి చంపిన తమ్ముడు

ఇక ఈ క్రమంలో అన్న సాబేర్ ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న తమ్ముడు , వదిన, సాబేర్ కొడుకు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో అన్న ఇంటికి వెళ్ళాడు.మద్యం తాగి వచ్చిన సాబేర్ తో ఆజమ్ ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి చివరకు ఆగ్రహంతో ఆజమ్ అన్న మెడకు బెడ్ షీట్ తో ఉరి బిగించి హతమార్చాడు. తమ్ముడు చేసిన ఊహించని పనికి విలవిలలాడిన అన్న మరణించాడు.

సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం .. చివరకు బయటపడిన హత్యోదంతం

సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం .. చివరకు బయటపడిన హత్యోదంతం

ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్న ఆజమ్ మరుసటి రోజు ఉదయం వచ్చి బాగా మద్యం తాగడం వల్ల కానీ, గుండెపోటు రావడం వల్ల కానీ అన్న మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతుని మెడ మీద కమిలినట్టు ఉండటంతో అతన్ని అనుమానించిన పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. తీరా అన్నను చంపింది తానే అని ఒప్పుకున్నాడు ఆజమ్. కారణం అన్న బాగా ఎదగటమే అని కూడా చెప్పాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+