రోజా ఇంట్లో భారీ చోరీ: రూ.10లక్షల విలువైన బంగారం అపహరణ
హైదరాబాద్: మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. మణికొండలోని ఆమె నివాసంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.
దొంగలు ఇంట్లోంచి రూ.10లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అంటున్నారు.

తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీరువాలో పెట్టిన విలువైన హారం ఎలా అపహరణకు గురైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలోనే దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించారు.












Click it and Unblock the Notifications