వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు రాజ‌య్య..! ఇప్పుడు గుంటకండ్ల జ‌గ‌దీష్‌రెడ్డి..! మరి వేటు ఎప్పుడు..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సుస్థిర, బలమైన పాలన అందిస్తున్నట్టు భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి ఇంట‌ర్ ఫ‌లితాలు శరాఘాతంగా మారాయి. ఇంట‌ర్మీడియ్ బోర్డు కార్యద‌ర్శి అశోక్‌, మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి కూడా త‌ప్పును ఒప్పుకోకుండా ఇదంతా విద్యార్థుల అపోహ‌గానే కొట్టిపారేసే ప్రయ‌త్నం చేస్తున్నారు. అక్షరాలా 19 మంది ఇంట‌ర్ పిల్లలు ఆత్మహ‌త్యలు చేసుకుంటే.. చాలా నింపాదిగా వ్యవ‌హ‌రిస్తున్న గులాబీ ప్రభుత్వం త‌గిన‌మూల్యం చెల్లించుకునే రోజులు ద‌గ్గర‌ప‌డుతున్నట్టు విద్యార్థి తల్లిదండ్రులు గులాబీ ప్రభుత్వాన్ని శాపానార్థాలు పెడుతున్నారు.

గులాబీ ప్రభుత్వానికి ఇంటర్ సెగ..! ఆహుతయ్యేదెవరు..!!

గులాబీ ప్రభుత్వానికి ఇంటర్ సెగ..! ఆహుతయ్యేదెవరు..!!

జరిగిన ఘ‌ట‌న‌పై సీరియ‌స్ యాక్షన్ తీసుకుని త‌ప్పును స‌రిదిద్దుకోవాల్సిన కీల‌క‌మైన నేత‌లు హ‌రీష్‌రావు, కేటీఆర్ వంటి వారు కూడా ట్వీట్లతో స‌రిపెడుతున్నారు. క‌నీసం స‌గ‌టు మ‌నిషిగా కూడా వ్యవ‌హ‌రించపోవ‌టంపై ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాల నుంచి ఘాటైన విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నిక‌లు కూడా రావ‌టంతో.. త‌ప్పకుండా దీని ఎఫెక్ట్ రేప‌టి గెలుపుపై ప‌డుతుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

రాజయ్య రూట్ లో జగదీశ్ రెడ్డి..! ప్రగతి భవన్ లో జోరుగా సాగుతున్న చర్చ..!!

రాజయ్య రూట్ లో జగదీశ్ రెడ్డి..! ప్రగతి భవన్ లో జోరుగా సాగుతున్న చర్చ..!!

దీంతో త‌ప్పును స‌రిదిద్దుకున్నట్టుగా ఏమార్చేందుకు చంద్రశేఖర్ రావు కీల‌క అస్త్రం సంధించ‌బోతున్నాడ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదే.. ఇంట‌ర్ బోర్డు సెక్రట‌రీ అశోక్ ను బ‌దిలీ చేయ‌ట‌మో.. లేక‌పోతే స‌స్పెండ్ చేయ‌ట‌మో చేస్తార‌నే ప్రచారం సాగుతుంది. ఇక మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ని కూడా ప‌ద‌వి నుంచి తొల‌గించి మ‌రో ఎస్సీ ఎమ్మెల్యేకు ప‌ద‌వి క‌ట్టబెట్టినా ఆశ్చర్యం లేద‌ట‌. అదెలా అంటారా.. 2014లో తొలిసారి సీఎం అయిన కేసీఆర్ ద‌ళితుడిని ఉప ముఖ్యమంత్రి చేశానంటూ దళిత వ‌ర్గానికి చెందిన టి.రాజ‌య్యకు వైద్యశాఖ‌తో పాటు డిప్యూటీ సీఎం ప‌ద‌విని క‌ట్టబెట్టారు.

కేవలం 8నెలల్లో రాజయ్య పదవికి ఎసరు..! తర్వాత ఆ మంత్రేనా..!!

కేవలం 8నెలల్లో రాజయ్య పదవికి ఎసరు..! తర్వాత ఆ మంత్రేనా..!!

అయితే అది కూడా మూణ్నాళ్ల ముచ్చట‌గానే సాగింది. మంత్రి ప‌దవి చేప‌ట్టిన ఆనందంలో రాజ‌య్య అన్నీ తానై చ‌క్రం తిప్పాల‌నుకున్నారు. మంత్రిగా త‌న‌కూ కొన్ని పరిమితులు, హ‌ద్దులుంటాయ‌ని.. చంద్రశేఖర్ రావు ఆదేశాల‌తో మాత్రమే ఫైళ్లమీద సంత‌కాలు చేయాల‌నే చిన్న విష‌యాన్ని మ‌ర‌చిపోయి వ్యవమరించారు. దీంతో ప‌దోన్నతులు, పోస్టింగ్‌లు, కాంట్రాక్టులు అన్నింటా తాన‌య్యాడు. అంతే అవినీతి ఆరోప‌ణ‌లు.. ముడుపులు.. స్కామ్‌ల‌తో రాజ‌య్య పేరు మారుమోగింది.

ఉగ్రరూపం దాల్చుతున్న ఇంటర్ నిరశనలు..! కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూపు..!!

ఉగ్రరూపం దాల్చుతున్న ఇంటర్ నిరశనలు..! కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూపు..!!

చివ‌ర‌కు.. ఆసుప‌త్రుల్లో ప్రతి ప‌నికీ క‌మీష‌న్ అనేంత వ‌ర‌కూ చేరింద‌నే ప్రచార‌మూ లేక‌పోలేదు. దీంతో రాజ‌య్యను రాజీనామా చేయించి 8 నెల‌ల్లోనే మాజీను చేశారు. ఆ త‌రువాత క‌డియం శ్రీహ‌రికి విద్యాశాఖ‌తోపాటు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంద‌ట‌. అయితే.. అప్పుడు రాజ‌య్య ప్లేస్‌లో జ‌గ‌దీష్‌రెడ్డి అనేది గులాబీ శ్రేణుల్లో అంత‌ర్గతంగా సాగుతున్న చ‌ర్చ. మరి ఇంటర్ చిచ్చు పూర్తి స్థాయిలో అగ్నిగుండంగా మారకముందే చంద్రశేఖర్ రావు ముందస్తుగా స్పందిస్తే ప్రభుత్వానికి క్షేమకరమనే చర్చ జరుగుతోంది.

English summary
The inter results of the Telangana Chief Minister Chandrasekhar Rao, who are supposed to be a stable, strong regime, have been shocking.Literally 19 children of inter-suicide victims, The pink government that is unable to take actions on defaulters. with this parents of the inter students cursing the trs government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X