No Marriages: వారికి షాక్.. మూడు నెలల వరకు ఆగాల్సిందే..!

ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ చేసుకున్నవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే. ఎందుకంటే మరో మూడు నెలల వరకు ముహూర్తలు లేవు. శనివారం నుంచి మూఢం ప్రారంభమైనట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ మూడు నెలలు గ్రహయోగ దోషం ఉంటుందని.. అందుకే పెళ్లిళ్లకు ముహూర్తలు ఉండవని వివరిస్తున్నారు. గ్రహాల స్థితి, రాశుల కదలికను బట్టి మూఢం ఉంటుందని పేర్కొంటున్నారు.

హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు, అలాగే గురు గ్రాహం కూడా సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు మూఢంగా పేర్కొంటారు. ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించేలమని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. తిరిగి ఆశ్వయజ మాసంలో మంచి ముహూర్తలు ఉంటాయని చెబుతున్నారు. సో మూడు నెలల వరకు బ్యాండ్ బాజాలు, భరత్ డ్యాన్సులు ఉండవు ఇక.

There are no muhurtas for marriages in the state for three months

పెళ్లిలు లేకుంటే చాలా వ్యాపారాలు నెమ్మదిస్తాయి. ముఖ్యంగా వస్త్రా వ్యాపారాలకు అంతగా గిరాకీ ఉండదు. ముఖ్యంగా ఈ మూడు నెలల కాలంలో ఎలాంటి పండుగలు కూడా లేదు. దీంతో బట్టల దుకాణాలకు గిరాకీ భారీగా తగ్గొచ్చు. అలాగే ఈవెంట్ మేజర్లకు కూడా అంతగా గిరాకీ ఉండది. టెంట్ వేసే వారికి, బ్యాండ్ వారికి కూడా గిరాకీ ఉండదు. ఫంక్షన్ హాళ్లకు కూడా గిరాకీ అంతగా ఉండదు. ముఖ్యంగా బంగారానికి డిమాండ్ తగ్గొచ్చు. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్లు లేకుంటే బంగారం ధర తగ్గుతుందో చూడాలి.

అలాగే బ్రహ్మణులు, క్యాటింగ్, శుభలేఖలు అచ్చు వేసే వారు, ట్రావెల్స్ వారికి కూడా గిరాకి తగ్గొచ్చు. సాధారణంగా పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెడుతుంటారు. గత సంవత్సరం డిసెంబర్ లో 38 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ఈ పెళ్లిళ్ల కోసం రూ.4.4 లక్షల కోట్లు ఖర్చు జరిగినట్లు అంచనా వేశారు. అంటే ఈ మూడు నెలలు వ్యాపారులు, ఫంక్షన్ హాల్స్ ఇతరులు ఎంత నష్టపోతారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+