Theenmar Mallanna: భువనగిరి లోక్‍సభ బరిలో తీన్మార్ మల్లన్న..!
తీన్మార్ మల్లన్న వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పెద్దలు తీన్మార్ మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.
ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న లేదా కోదండరామ్ లేదా అకునూరి మురళికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు భువనగిరి నుంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే మద్దుతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది.

అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తీన్మార్ మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న మొదట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ.. ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసిపోయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కూడా తీన్మార్ మల్లన్నకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డిని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ టికెట్ తీన్మార్ మల్లన్నకు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే.. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, అలాగే బీఆర్ఎస్ బూడిద బిక్షమయ్య గౌడ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది.












Click it and Unblock the Notifications