బాబుకు, కెసిఆర్‌కు తేడా లేదా?: 10శాతం మందికి కూడా.. టిఆర్ఎస్‌పై కోదండ
హైదరాబాద్: ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పైన వరవర రావు సోమవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ కౌంటర్లు, ప్రజదా వ్యతిరక విధానాలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు పెద్దగా తేడా ఏమీ లేదని వాపోయారు.
ఎన్ కౌంటర్లు జరగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. వరంగల్ ఎన్ కౌంటర్లో మృతి చెందిన శృతి, విద్యాసాగర రావులను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. వీరిద్దరిని 13వ తేదీనే పట్టుకొని 15వ తేదీన కాల్చి చంపారన్నారు.

10 శాతం మందికి కూడ సాయం అందలేదు: కెసిఆర్ పాలనపై కోదండ ఆగ్రహం
కెసిఆర్ పాలన పైన తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చశారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యకు ఆర్థిక సంక్షోభమే కారణమని చెప్పారు.
ఆత్మహత్య చేసుకున్న్ రైతుల్లో కనీసం 10 శాతం మందికి కూడా ఆర్థిక సాయం అందడం లేదన్నారు. వ్యవసాయ విధానాలలో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులు బయటకు వెళ్తే గౌరవం లేని పరిస్థితి ఉందన్నారు.












Click it and Unblock the Notifications