తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...
తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్‌లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(జూన్ 22) మృతి చెందాడు. దీంతో పోలీస్ శాఖలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 3కి చేరింది.
Recommended Video
మే 21న కానిస్టేబుల్ యాదగిరి,జూన్ 16న హోంగార్డ్ అశోక్ కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు,దాదాపు 200 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.

కరోనా వైరస్ చర్యల్లో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ యత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ... కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
పోలీస్ ఎంపానల్డ్ ఆస్పత్రుల్లో పోలీసులకు చికిత్స చేయకూడదని ప్రభుత్వం జీవో జారీ చేయడమేంటని ప్రశ్నించారు. కోవిడ్ 19ని ముందు వరుసలో ఉండి ఎదుర్కొంటున్న పోలీసులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఎవరైనా చికిత్స చేయమని జీవోలు ఇస్తారు కానీ తెలంగాణ ప్రభుత్వం చికిత్సను నిరాకరించమని జీవోలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదిలా ఉంటే, ఆదివారం(జూన్ 21) నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7820కి చేరింది. ప్రతీరోజూ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications