వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడా.!పాడా.!విజయ గర్జన సభ రద్దుకు అసలు కారణం ఇదే.!గులాబీ నేతల్లో ఆసక్తికర చర్చ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు గులాబీ పార్టీ తలపెట్టిన విజయగర్జన సభ రద్దవ్వడం వెనక కూడా అనేక కారణాలు ఉన్నట్టు గులాబీ నేతలు చెప్పుకొస్తున్నా ప్రధాన కారణం మాత్రం ఒకటే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ తరవాత హుజురాబాద్ం ఉప ఎన్నిక ముగుస్తుంది. ప్లీనరీ ద్వారా వచ్చిన మైలేజ్ ను హుజురాబాద్ ఉప పోరులో ఉపయోగించుకొని, అదే మైలేజ్ కు కొనసాగింపుగా విజయగర్జన సభ నిర్వహించాలని మొదట ఓ బృహత్కర కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు పథకం రచించారు. కాని హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో గులాబీ శ్రేణుల వ్యూహం మొత్తం బెడిసి కొట్టినట్టు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే విజయ గర్జన సభపై ఆ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.

గులాబీ నేతల వ్యూహాన్ని తారుమారు చేసిన హుజురాబాద్ ఫలితం.. ఇప్పట్లో ఎలాంటి బహిరంగ సభలు లేనట్టే..

గులాబీ నేతల వ్యూహాన్ని తారుమారు చేసిన హుజురాబాద్ ఫలితం.. ఇప్పట్లో ఎలాంటి బహిరంగ సభలు లేనట్టే..

తానొకటి తలిస్తే పైవాడు మరొకటి తలుస్తాడన్న నానుడి గులాబీ పార్టీ అంశంలో నిజమైనట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మక విజయంగా చిత్రీకరించి, తెలంగాణలో ఎదురులేని పార్టీగా గులాబీ పార్టీని ఆవిష్కరించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను తెలంగాణ సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారు గులాబీ నేతలు. అంతే కాకుండా ప్లీనరీ ద్వారా వచ్చిన సానుకూల దృక్పదాన్ని హుజురాబాద్ ఉప్ప ఎన్నికలతో ముడిపెట్టి ప్రజాభిమానాన్ని విజయగర్జన సభ ద్వారా క్యారీ ఫార్వార్డ్ చేయాలని టీఆర్ఎస్ నేతలు భావించారు. కాని హుజురాబాద్ ఉప్ప ఎన్నిక ఫలితం అంతా తారుమారు చేసిందనే చర్చ పింక్ నేతల్లో జరుగుతోంది.

అధికారం ఉంటే ఓట్లు వేస్తారా.? నైతికతకు పట్టం కట్టిన హుజురాబాద్ ప్రజలు

అధికారం ఉంటే ఓట్లు వేస్తారా.? నైతికతకు పట్టం కట్టిన హుజురాబాద్ ప్రజలు

వాస్తవానికి హుజురాబాద్ ఎన్నిక యాదృచ్చకాంగా వచ్చిన ఎన్నిక కాదు. మానవ తప్పిదాల పోటీలో ఎవరు ఎక్కువ తప్పులు చేసారు అనే అంశాన్ని ప్రజలు నిర్ధారించి తీర్పు చెప్పాలనే కోణంలో హుజురాబాద్ ఉప ఎన్నిక చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా అధికారం ఉందనే ఒక రకమైన భరోసాతో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మధ్యకు వెళ్తే ఆత్మగౌరవం నినాదంతో ఈటల రజేందర్ ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ రెండు అంశాల్లో ప్రజలు తెలివిగా వ్యవహరించారని, ఎవరికి ప్రజా క్షేత్రంలో శిక్ష వేయాలి, ఎవరికి విజయాన్ని అందించాలన్న అంశంలో తిరుగులేని తీర్పు ఇచ్చినట్టు తెలంగాణ సమాజంలో లోతైన చర్చ జరుగుతోంది.

అవసరాలకు మించి హామీలు.. గులాబీ పార్టీ కొంప ముంచిన వాగ్దానాలు..

అవసరాలకు మించి హామీలు.. గులాబీ పార్టీ కొంప ముంచిన వాగ్దానాలు..

అబ్రహం లింకన్ అన్నట్టు అన్ని సమాయాల్లో అందరిని మోసం చేయలేం, కొంత సమయంలో కొందరిని మాత్రమే మోసం చేయగలం అనే సూక్తి వందకు వంద శాతం హుజురాబాద్ ఉప ఎన్నికలో రుజువైందనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ మోతాదు మించి సంక్షేమ పథకాల ప్రకటనలు చేసిందని, దాంతో మొదటికే మోసం జరిగిందనేది గులాబీ నేతల వాదన. అదికార పార్టీ ప్రజల అవసరాలకు అనుగుణంగా వాగ్దానాలు చేస్తే ప్రజల్లో నమ్మకం కుదురుతుంది కానీ అమలు కాని హామీల వర్షం కురిపించనప్పుడే ప్రతికూల ఫలితాలు వచ్చి అధికారం చేతిలో ఉన్నా అబాసు పాలు కాక తప్పదని చెప్పానికి హుజురాబాద్ ఉప ఎన్నికే పెద్ద ఉదాహరణగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

MLC Elections : బిగ్ ఫైట్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల కోలాహలం..! || Oneindia Telugu
విజయగర్జన సభ అందుకే రద్దు.. ఇప్పట్లో బహిరంగ సభలు వద్దు..

విజయగర్జన సభ అందుకే రద్దు.. ఇప్పట్లో బహిరంగ సభలు వద్దు..

ఒక్క తప్పటడుగు వంద అపజయాలకు కారణం అవుతుందన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి హుజురాబాద్ ప్రతిబంధకంగా పరిణమించింది. ఇందులో సీఎం చంద్రశేఖర్ రావు స్వయంకృతాపరాధం వందకు వెయ్య శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఓటమితో ఏ ముఖం పెట్టుకొని విజయగర్జన సభ నిర్వహించాలి.? ఒక వేళ సభ నిర్వహిస్తే ప్రజలు సహకరిస్తారా.? ప్రజలు సభకు వచ్చినా సభా ముఖంగా ఏం చెప్పాలి.? లెక్కకు మించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా హుజురాబాద్ ప్రజలు తిరస్కరించారని చెప్పాలా..?అసలు హుజురాబాద్ ఓటమికి ఎవరిది ప్రధాన బాద్యత.?ప్రస్తుత తరుణంలో ఒకరిని ఒకరు నిందించుకుంటూ ప్రజల్లో మరింత చులకన అయ్యేకన్నా కొన్నాళ్లు బహిరంగ సభలు వంటి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే బెటర్ అనే తుది నిర్ణయానికి రావడంతోనే వరంగల్ లో తలపెట్టిన విజయ గర్జన సభను గులాబీ దళపతి రద్దు చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

English summary
Although Trs leaders say there are a number of reasons behind the cancellation of the Pink Party-led victory Meeting, There are rumors that the main reason is the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X