నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం: బిజెపి ఎమ్మెల్యేకు బెదిరింపు ఫోన్
హైదరాబాద్: నన్ను, నా కుటుంబాన్ని హతమారుస్తామని, ఏ సమయంలోనైనా చంపేస్తామని రెండు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న నిజామాబాద్ వెళ్తున్న సందర్భంగా తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. నీ అంతు చూస్తామని బెదిరించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తనకు వచ్చిన ఫోన్ క్లాస్ నెంబర్లను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఆయన ఇచ్చారు. తనకు బుధవారం ఉదయం 10.15 గంటలకు, ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నరకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. తన కుటుంబీకులకు ఏమైనా జరిగితో పోలీసులదే బాధ్యత అన్నారు. గతంలో చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications