రెండు వారాల్లో మూడు హత్యలు: రూ. 500 అవసరమైతే చంపేస్తాడు! సీరియల్ కిల్లర్ అరెస్ట్
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన వరుస హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. మద్యం, గంజాయికి అలవాటుపడిన ఓ పాత నేరస్తుడే.. వీటి కోసం డబ్బులు అవసరమైతే చాలు హత్య చేశాడని గుర్తించారు. ఈ వరుస హత్యలకు పాల్పడిన సైకో సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 14 రోజుల్లోనే ముగ్గురిని దారుణంగా హతమార్చడం గమనార్హం. హంతకుడి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు చివరకు పట్టుకున్నారు.
రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మధు, డీఐ రాజేంద్ర గౌడ్‌లతో కలిసి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన బ్యాగరి ప్రవీణ్(34) చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఫయాజ్, దర్గా నరేశ్‌తో కలిసి ముఠా కట్టిన ప్రవీణ్.. 2011లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ముగ్గురూ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. అదే సమయంలో కుటుంబ యజమాని యాదయ్య మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో బండరాయితో కొట్టి చంపారు. అంతేగాక, ఆయన భార్యపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపారు. అలికిడితో నిద్రలేచిన ఆమె కుమారుడిని కూడా హతమార్చారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు, డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ మూడు హత్యలు చేసిన తర్వాత ప్రవీణ్ స్నానం చేసి స్థానిక గుడిలో పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ సంవత్సరంలోనే ప్రవీణ్ మరో రెండు హత్యలు చేశాడు. రాజేంద్రనగర్‌లోని పిల్లర్ నెంబర్ 127 దగ్గర రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ యాచకుడిని, పుట్‌పాత్‌పై నివాసముండే బద్వేల్ వాసి పీ ప్రకాశ్‌ను బండరాయితో తలపై మోది హత్య చేశాడు. వారి దగ్గర ఉన్న సొమ్ముతో పరారయ్యాడు. ఇలా పలు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. అన్ని కేసుల్లోనూ కలిపి 2014 జూన్‌లో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అయితే, గత ఏడాది నవంబర్ నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు ప్రవీణ్. అప్పట్నుంచి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గృహకల్ప దగ్గర ఉంటున్నాడు. మద్యం, గంజాయికి డబ్బులు అవసరమై మళ్లీ హత్యలు మొదలుపెట్టాడు ప్రవీణ్. ఈ క్రమంలోనే జూన్ 7న మైలార్‌దేవ్‌పల్లి పరిధి నేతాజీనగర్‌లోని రైల్వే ట్రాక్ పక్కన నిద్రిస్తున్న ఓ యాచకుడిని బండరాయితో తలపై కొట్టి చంపాడు. జూన్ 21న అర్ధరాత్రి మైలార్‌దేవ్‌పల్లి స్వప్న థియేటర్ దగ్గర నిద్రిస్తున్న దుప్పట్లు అమ్మకునే వ్యక్తి(40)ని బండరాయితో హతమార్చి అతని వద్ద డబ్బు ఎత్తుకెళ్లాడు.
అక్కడ్నుంచి దుర్గానగర్ క్రాస్‌రోడ్డు వరకు వెళ్లి అక్కడ తాత్కాలిక షెడ్డు వేసుకుని నివసిస్తున్న వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. అతని దగ్గరున్న డబ్బు లాక్కొని పారిపోయాడు. కాగా, నిందితుడు రూ. 500 అవసరమైనప్పుడల్లా హత్యలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మూడు హత్యలు వరుసగా జరగడంతో ఆ ప్రాంతంలోని వంద సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడి ఆచూకీ కనుగొన్నట్లు ఆయన తెలిపారు.
అయితే, నిందితుడు ప్రవీణ్‌కు ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం గమనార్హం. ఎందుకు హత్య చేశాని పోలీసులు ప్రశ్నిస్తే.. చంపేశాను.. అయిపోయింది.. ఏం చేద్దాం? అంటూ అతడు బదులివ్వడం గమనార్హం. కాగా, నిందితుడిపై మొత్తం 8 హత్య కేసులు, ఒక అత్యాచారం, ఐదు దోపిడీ కేసులున్నట్లు దర్యాప్తులో గుర్తించామని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications