దసరా పార్టీ చేసుకుంటున్న స్నేహితులపై పడిన పిడుగు: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. దేశమంతా విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో, పండుగ జోష్ లో ఉన్న యువకుల బృందం పై పిడుగు పడి ముగ్గురు మరణించిన ఘటన విషాదంగా మారింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే

పార్టీ చేసుకుంటున్న స్నేహితులపై పిడుగు

పార్టీ చేసుకుంటున్న స్నేహితులపై పిడుగు


దసరా పండుగ నాడు సరదాగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని భావించిన కొందరు మిత్రులు బయట కలుసుకోవాలని ప్లాన్ చేశారు. వర్ధన్నపేట మండలం, బండౌతాపురం గ్రామ శివారులో స్నేహితులందరూ ఒక చోటికి చేరారు. మిత్రులు అందరూ కలిసి పండుగ సందర్భంగా మద్యం సేవిస్తూ ముచ్చట పెట్టుకుంటున్నారు. సరదాగా అందరూ కలిసి గడుపుతున్న సమయంలో మొత్తం ఏడుగురు సభ్యులున్న ఈ బృందం పై ఒక్కసారిగా పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ పరిణామానికి ఏం జరుగుతుందో అర్ధం చేసుకునే లోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

 ముగ్గురు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు

ముగ్గురు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు


దసరా పండుగ నాడు పిడుగుపడి మృతి చెందిన ముగ్గురిని మరుపట్ల సాంబరాజు,బాలగాని హరికృష్ణ, శివ కృష్ణలుగా గుర్తించారు. గాయపడిన ఇద్దర్నీ వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగనాడు సంతోషంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయి. చేతికి వచ్చిన చెట్టంత కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు.

తెలంగాణాలో వర్షాలు, పిడుగు పాట్ల కారణంగా గతంలో రైతులు మృతి

తెలంగాణాలో వర్షాలు, పిడుగు పాట్ల కారణంగా గతంలో రైతులు మృతి

ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, పిడుగుపాట్ల కారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆగస్టు 4 వ తేదీన ముగ్గురు పిడుగు పడి మృతి చెందారు. ముగ్గురు రైతులు తమ పొలంలో వ్యవసాయం చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. ఇక తాజాగా వర్ధన్నపేట లో దసరా రోజు పార్టీ చేసుకుంటున్న యువకులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద ఉండకూడదని సలహా

వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద ఉండకూడదని సలహా


అందుకే వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద ఉండకూడదని పదేపదే అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పిడుగులు ఎక్కువగా చెట్ల మీద పడే అవకాశం ఉంటుందని, పొరబాటున కూడా చెట్ల క్రింద ఉండకూడదని అంటున్నారు. మనకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం మంచిది కాదని సూచిస్తున్నారు. కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాలను పణంగా పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+