తెలంగాణలోనే సుందరమైన వాటర్ ఫాల్స్.. హైదరాబాద్ కు దగ్గరలోనే..
చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో జలపాతం.. ఈ సుందరమైన దృశ్యాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తెలంగాణలోనే అత్యంత సుందరమైన జలపాతంగా దీనికి పేరుంది. దీనిని బ్లూ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కొండకోనల నుంచి జాలువారే నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇది కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల గ్రామం పరిధిలో ఉంది. దీన్ని తిర్యాణి వాటర్ ఫాల్స్ లేదా గుండాల వాటర్ ఫాల్స్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ జలపాతం ప్రత్యేకత ఏంటంటే సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారుతుంది. రాతి కొండల మధ్యలో నుంచి ఈ నీరు కిందకు పడుతుంది.
తెలంగాణలోని అనేక జలపాతాల కంటే తిర్యాణి జలపాతాన్ని చాలా అందమైన జలపాతంగా పరిశోధకులు పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ జలపాతం నీళ్లు బ్లూ కలర్ లో ఉంటాయి. అవి సముద్రం నీరులా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే ఈ వాటర్ ఫాల్ దట్టమైన అడవిలో ఉంటుంది. దీంతో ఈ జలపాతానికి వచ్చే పర్యటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. సుమారు 60 అడుగుల పైనుంచి నీళ్లు కిందకు జాలువారుతుంటాయి. ఇదో గొప్ప అనుభూతిగా పర్యటకులు భావిస్తారు. శీతాకాలంలో జలపాతం అందాలు మరింత రమణీయంగా ఉంటాయి. నేచర్ లవర్స్ ఈ వాటర్ ఫాల్స్ ను తప్పకుండా చూడాలని అంటున్నారు. ఇప్పటికే ఈ జలపాతంపై పలు వీడియోలు, రీల్స్ చేశారు ఔత్సాహికులు. దీంతో ఇటీవలకాలంలో ఈ వాటర్ ఫాల్స్ మరింత ప్రసిద్ధి చెందింది.

తిర్యాణి మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 6 గంటల్లో ఈ వాటర్ ఫాల్స్ కు చేరుకోవచ్చు. వీకెండ్స్ లో ఉదయం బయల్దేరి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. ఈ జలపాతానికి పర్యటకులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు.వర్షాకాలం, శీతాకాలంలో పర్యటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడి అడవుల మధ్య జలపాతానికి ట్రావెలింగ్ ప్రకృతి ఒడిలో అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో ఈ జలపాతంలో హాయిగా విహరించవచ్చు.












Click it and Unblock the Notifications