తెలంగాణలో పెరిగిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,825 మందికి పాజిటివ్..

తెలంగాణలో కరోనా కేసు సంఖ్య తగ్గినట్లే తగ్గి మరలా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1825 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకరు మృతి చెందారు. 350 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 97.26 శాతం ఉందని కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఉస్మానియాలో 11 మంది వైద్యులకు కరోనా సోకింది.

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా బారిన పడి వారి సంఖ్య ఆదివారంతో పోలిస్తే కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,825 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆదివారం 1,673 మంది మహమ్మారి బారినపడ్డారు. నిన్నటి కంటే ఈ రోజు 152 కరోనా కేసులు పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,995 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 70,697 శాంపిల్స్ పరీక్షించారు. మొత్తం 350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 0.58 శాతం ఉంది. రికవరీ రేటు 97.26 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

 ఉస్మానియాలో 11 మంది డాక్టర్లకు పాటిజివ్

ఉస్మానియాలో 11 మంది డాక్టర్లకు పాటిజివ్

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా వైరస్ బారినపడ్డారు. ఉస్మానియాలో విధులు నిర్వహిస్తున్న 11మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో క‌రోనా పరీక్షలు నిర్వహిచుకున్నారు. వీరిలో 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని చికిత్స నిమిత్తం ఐసోలేషన్‌కు తరలించారు.

భయం వద్దు .. జాగ్రత్తలు పాటించండి

భయం వద్దు .. జాగ్రత్తలు పాటించండి

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. భయాందోళన చెందవద్దు . కాని అశ్రద్ధ మాత్రం చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. జనం స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కరోనా వైరస్ కట్టడికి అస్కారం ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనాలు గుంపులు గుంపులుగా కలిసి ఉండరాదని సూచించారు. రాష్ట్రం వ్యాప్తంగా కరోనా ఆంక్ష‌లను ఈ నెల 20 వ‌ర‌కు పెంచ‌డంతో రోజు వారి కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ మాస్క్ ధరించాలని కరోనా నిబంధనలు విధిగా పాటించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 బూస్టర్ డోస్ పంపిణీ

బూస్టర్ డోస్ పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి కోసం కేంద్రం మరో అడుగు వేసింది. దేశ వ్యాప్తంగా బూస్టర్ డోస్‌ను ప్రారంభించింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు , ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు ఈ థర్డ్ డోసును వేస్తున్నారు. మొత్తం 5.75 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. తెలంగాణలో బూస్టర్ డోసును చార్మినార్ యునానీ ఆస్పత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అందరికీ వ్యాక్సిన్ ప్ర‌భుత్వం అందిస్తోందని తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య వారిలో కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి వివరించారు. వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+