రేపటి నుంచి టోల్ ట్యాక్స్, ప్రత్యామ్నాయంగా స్వైపింగ్: రోడ్లపై చిల్లర కష్టాలు తప్పవా?
నోట్ల రద్దు అనంతరం టోల్ ట్యాక్స్ వసూలును నిలిపివేశారు. డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తిరిగి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు.
హైదరాబాద్/అమరావతి: నోట్ల రద్దు అనంతరం టోల్ ట్యాక్స్ వసూలును నిలిపివేశారు. డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తిరిగి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పైన తిరిగి టాక్స్‌లు వసూలు చేస్తారు.
నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నేపథ్యంలో వాహనదారులకు చిల్లర కష్టాలు తప్పించేందుకు టోల్ ట్యాక్సు వసూలును నిలిపివేశారు.
తొలుత నవంబర్ 11 వరకు టోల్ ట్యాక్స్ నిలిపివేశారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు పొడిగించారు. నవంబర్ 14వ తేదీకి, 18వ తేదీకి, 24వ తేదీకి పొడిగించారు. చివరగా డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. రేపు డిసెంబర్ 2వ తేదీ. రేపు అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు చేస్తారు.

కాగా, టోల్ ప్లాజా వద్ద రూ.2000లు ఇస్తే చిల్లరకు సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. తద్వారా వాహనదారులకు చిల్లర కష్టాలు లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. అయినప్పటికీ ఇబ్బందులు ఎంతోకొంత ఉండే అవకాశాలున్నాయి. ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తోన్న విషయం తెలిసిందే.
కొన్ని ముఖ్యమైన జాతీయ రహదారులు
ఏపీలో.. ఎన్‌హెచ్ (జాతీయ రహదారి) 65 తడ - శ్రీకాకుళం, హైదరాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, కర్నూలు - బెంగళూరు, కర్నూలు - కడప రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే, కోదాడ - విజయవాడ, ఏలూరు - తణుకు రహదారులు. తెలంగాణలో.. అదిలాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - రాయగిరి- వరంగల్, హైదరాబాద్ - దామరచర్ల తదితరాలు ఉన్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications