టాలీవుడ్ హీరో స్థలం కబ్జా: నకిలీ డాక్యుమెంట్స్‌తో మాయ!
నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి.. ఆ స్థలంలో పాగా వేయాలని చూశారు. ఈ మేరకు ఆ స్థలంలో బోరు వేయడం కూడా ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలో స్థలాలు ఉన్నవాళ్లు.. ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా సరే.. రాత్రికే రాత్రే వారి స్థలాలు కబ్జాకు గురవడం ఖాయం. తాజాగా టాలీవుడ్ హీరో రాజా కుటుంబ సభ్యులకు చెందిన స్థలం కబ్జాకు గురైంది.
హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పరిధిలో ఉన్న సమతానగర్ లో 1996లో రాజా కుటుంబ సభ్యులు కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఓ చిన్న గది, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి వదిలేశారు. ఈ క్రమంలో బల్వంతరెడ్డి, మాధవి దంపతుల కన్ను ఆ స్థలంపై పడినట్లు చెబుతున్నారు.

నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి.. ఆ స్థలంలో పాగా వేయాలని చూశారు. ఈ మేరకు ఆ స్థలంలో బోరు వేయడం కూడా ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ తంతు రాజా కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వెంటనే బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications