• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాలీవుడ్ హీరోలు తగ్గట్లేదుగా ..కరోనా వ్యాప్తిపై మహేష్ బాబు .. పదోతరగతి పరీక్షల రద్దుపై మంచు విష్ణు

|

తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కి దగ్గరగా ఉన్న సినీ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పదోతరగతి బోర్డు పరీక్షలు అవసరమా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చేస్తే, రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనాకేసుల గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆందోళన వెలిబుచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలోనే కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నారు .

 లాక్ డౌన్ సడలింపుల వల్లే కరోనా కేసుల పెరుగుదల అన్న మహేష్ బాబు

లాక్ డౌన్ సడలింపుల వల్లే కరోనా కేసుల పెరుగుదల అన్న మహేష్ బాబు

కరోనా విషయంలో ఆందోళన వెలిబుచ్చిన టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు లాక్ డౌన్ సడలించిన నాటి నుండి పరిస్థితి దారుణంగా మారింది అని అభిప్రాయపడ్డారు. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పిన మహేష్ బాబు, ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అందరూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు భౌతికదూరం పాటించాలని మహేష్ బాబు సూచించారు.

ఆరోగ్య సేతు యాప్ వాడండి .. అప్రమత్తంగా ఉండండి

ఆరోగ్య సేతు యాప్ వాడండి .. అప్రమత్తంగా ఉండండి

కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆరోగ్య సేతు యాప్ వల్ల కరోనా నిర్ధారణ అయిన రోగులు సమీపాన ఉంటే యాప్ అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు .అత్యవసర వైద్య సదుపాయాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని మహేష్ బాబు అన్నారు. మనమందరం క్షేమంగా ఉండాలని,దాని కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు మహేష్ బాబు.

పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ నటుడు మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు పదో తరగతి పరీక్షల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి విద్యార్థులకు బోధన పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని తాను గట్టిగా అనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు 14, 15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు వంటి విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏంటి? అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.

ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ 10 తరగతికి బోర్డు పరీక్షలు వద్దు

ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ 10 తరగతికి బోర్డు పరీక్షలు వద్దు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. రాష్ట్రాలలో ఎస్ఎస్సి పరీక్షలే కాకుండా, సిబిఎస్ఈ పరిధిలోని 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈ ఏడాది మాత్రమే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని తను బలంగా కోరుకుంటున్నా అంటూ పేర్కొన్నారు. మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మనోజ్ ట్వీట్ పై నెటిజన్ల భిన్న స్పందన

మనోజ్ ట్వీట్ పై నెటిజన్ల భిన్న స్పందన

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంచు మనోజ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉంటే మరికొందరు గతంలో ఏడో తరగతి విద్యార్థులకు కూడా బోర్డు ఎగ్జామ్స్ ఉండేవని, ఆ తర్వాత 7 వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారని ,ఇప్పుడు ఇవి కూడా తీసేస్తే పిల్లలు అసలే చదవరని అంటున్నారు . ఇక విద్యాభ్యాసానికి మన పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఒక శాపం లాంటిదని గతంలో 1993లో జాకీర్ హుస్సేన్ కమిటీ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు నెటిజన్.

 ప్రభుత్వాలకు దగ్గర ఉండే సెలబ్రిటీల తాజా వ్యాఖ్యలపై ఆసక్తి

ప్రభుత్వాలకు దగ్గర ఉండే సెలబ్రిటీల తాజా వ్యాఖ్యలపై ఆసక్తి

ఇక టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా కంట్రోల్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని ఆలోచిస్తున్న సమయంలో కేటీఆర్ కు దగ్గర వాళ్లు గా గుర్తించబడిన హీరో మహేష్ బాబు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మంచు విష్ణు సైతం పదో తరగతికి బోర్డు పరీక్షలు వద్దని తన అభిప్రాయం చెప్పడం కూడా అందరూ ఆలోచిస్తున్న అంశం.

English summary
Tollywood celebrities who are close to telangana minister KTR made interesting comments. Superstar Mahesh Babu has expressed concern over the growing coronacuses in the state, when Manchu Manoj made a statement saying that there is a need for abolish 10th board exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more